ప్రపంచ న్యూరోసర్జర్ తో డాక్టర్ నాగార్జున

ప్రపంచ న్యూరోసర్జర్ తో డాక్టర్ నాగార్జున
వెల్దండ, ఆంధ్రప్రభ : అంతర్జాతీయ న్యూరోసర్జికల్ సదస్సు ఎం. ఏ.ఎస్. ఎస్. ఐ. ఎన్.(MASSIN) 2026లో వెల్దండ మండలం కొట్ర గ్రామానికి చెందిన డాక్టర్ నాగార్జున భూత్కూరి పాల్గొన్నారు. ఈ సందర్బంగా ముంబైలో న్యూరలాజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా సహకారంతో నిర్వహించిన ప్రతిష్టాత్మక అంతర్జాతీయ న్యూరోసర్జికల్ సదస్సు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ న్యూరోసర్జన్లు, అంతర్జాతీయ అధ్యాపక సభ్యులు హాజరయారు. ఈ సదస్సు, సమకాలీన న్యూరోసర్జికల్ పరిజ్ఞానం, వైద్య సహకారాన్ని పెంపొందించేందుకు కీలక వేదికగా నిలిచిందని అన్నారు.
ఈ సదస్సు సందర్భంగా డాక్టర్ నాగార్జునకు ప్రపంచ ప్రఖ్యాత న్యూరోసర్జన్లు, వైద్య రంగంలోని దిగ్గజాలతో ప్రత్యక్షంగా చర్చించే అవకాశం లభించడం ఆనందకరమని డాక్టర్ నాగర్జున అన్నారు. సెరెబ్రోవాస్కులర్, స్కల్ బేస్ న్యూరోసర్జరీలో తన మార్గదర్శక కృషికి అంతర్జాతీయ గుర్తింపు పొందిన ప్రముఖ వాస్కులర్ న్యూరోసర్జన్ రాబర్ట్ స్పెట్జ్లర్తో సమావేశమై ఆధునిక మైక్రోసర్జికల్ పద్ధతులు, న్యూరోసర్జరీలో తాజా పురోగతులపై చర్చించారు. అనంతరం అంతర్జాతీయ ఖ్యాతి గాంచిన జర్మన్ న్యూరోసర్జన్, ఇంటర్నేషనల్ న్యూరోసైన్స్ ఇన్స్టిట్యూట్ వ్యవస్థాపక-అధ్యక్షుడు మజీద్ సమీను కలవడం దైవానుభూతిగా భావించారు.
డాక్టర్ నాగార్జున స్కల్ బేస్ న్యూరోసర్జరీలో మార్గదర్శకుడిగా గుర్తింపు పొందిన ప్రొఫెసర్ సమీతో జరిగిన చర్చలు వైద్య రంగంలో విశేష ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇక వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ న్యూరోసర్జికల్ సొసైటీస్ డబ్ల్యూ. ఎఫ్. ఎన్. ఎస్.(WFNS) నాయకత్వ సభ్యులతో పాటు ప్రపంచ న్యూరోసర్జికల్ సమాజానికి చెందిన పలువురు విశిష్ట ప్రతినిధులతో కూడా డాక్టర్ నాగార్జున అభిప్రాయాలు పంచుకున్నారు. MASSIN 2026లో పాల్గొనడం ద్వారా నిరంతర వైద్య విద్యా నైపుణ్యాల అభివృద్ధి, ఆధునిక న్యూరోసర్జికల్ సాంకేతికతలను రోగులకు అందించాలనే తన నిబద్ధతను డాక్టర్ నాగార్జున మరోసారి చాటిచెప్పారని వైద్య వర్గాలు అభిప్రాయపడ్డాయి.
