Megastar | చిరంజీవి ఎమోషనల్ పోస్ట్..
Megastar | చిరంజీవి ఎమోషనల్ పోస్ట్..
ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ప్రపంచ వ్యాప్తంగా మాతృదినోత్సవ వేడుకలు జరుపుకుంటున్న వేళ సినీ దిగ్గజం చిరంజీవి తన సామాజిక మాధ్యమంలో ఆసక్తికర విషయాన్నిపంచుకున్నారు. తన తల్లితో ఉన్న అనుబంధాన్ని తెలుపుతూ.. ఆమెతో ఉన్న అరుదైన ఫోటోలను షేర్ చేశారు. అంతే కాకుండా తన తల్లిపై ఉన్న అపారమైన ప్రేమ, గౌరవాన్ని వ్యక్తం చేస్తూ భావోద్వేగ పోస్టు కూడా చేశారు.

“అమ్మ… మన మొదటి గురువు, మన మొదటి ధైర్యం, కనిపించే దైవం కూడా “కని పెంచిన” మాతృమూర్తి తర్వాతే…! మన విజయాల వెనక త్యాగం… మన ప్రతి అడుగులోనూ నిశ్శబ్దంగా నిలిచే ఆశీర్వాదం అమ్మది. మనకంటే మనల్ని ఎక్కువగా ప్రేమించే ప్రతి మాతృమూర్తికి హృదయపూర్వక మాతృదినోత్సవ శుభాకాంక్షలు. “ అంటూ ఆయన సోషల్ మీడియాలో షేర్ చేసిన సందేశం అభిమానులను ఆకట్టుకుంటోంది. మెగాస్టార్ తన తల్లితో ఉన్న అనుబంధాన్ని ఎప్పుడూ గౌరవిస్తారని, ఆయన మాటలు ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉన్నాయని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

