రాజీవ్ గాంధీ సేవలు దేశానికి ఆదర్శనీయం

రాజీవ్ గాంధీ సేవలు దేశానికి ఆదర్శనీయం
- మండల పార్టీ అధ్యక్షులు హరికిషన్ నాయక్
వెల్దండ, ఆంధ్రప్రభ:
భారతరత్న, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ సేవలు దేశానికి ఆదర్శనీయమని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు హరికిషన్ నాయక్ అన్నారు. నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గ పరిధిలోని వెల్దండ మండల కేంద్రంలో రాజీవ్ గాంధీ 35వ వర్ధంతి వేడుకలను మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు హరికిషన్ నాయక్ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, డీసీసీ ప్రధాన కార్యదర్శి మోతీలాల్ నాయక్, ఉపాధ్యక్షుడు ఎన్నం భూపతిరెడ్డి పాల్గొని రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం వారు మాట్లాడుతూ రాజీవ్ గాంధీ దేశానికి చేసిన సేవలను స్మరించుకున్నారు. యువత అభివృద్ధి, సాంకేతిక రంగంలో దేశాన్ని ప్రపంచంలోనే ముందుకు నడిపించిన గొప్ప దార్శనిక నాయకుడిగా రాజీవ్ గాంధీని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో తాలూకా కిసాన్ సెల్ మండల అధ్యక్షుడు పర్వత్ రెడ్డి, మండల సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్, సర్పంచ్ బద్రి తారా సింగ్, మండల ఉప సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు ఎర్ర శీను ముదిరాజ్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మట్ట భరత్ గౌడ్, యూత్ కాంగ్రెస్ వెల్దండ గ్రామ కమిటీ అధ్యక్షులు జంగిలి ఆనంద్ రాజ్, జిల్లా ఎస్సీ సెల్ సేవాదళ్ ఉపాధ్యక్షులు కొయ్యల పుల్లయ్య, క్యాచారం వెంకటయ్య, మట్ట నాగేశ్వరరావు, గుద్దటి కిష్టాల్, రఘుపతి నాయక్, ఎండీ రషీద్, కొండల్, శ్రీనివాసులు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
