బిక్కనూర్ ప్రెస్ క్లబ్ అధ్యక్షునిగా రవికుమార్…

బిక్కనూరు, ఆంధ్రప్రభ ; మండల ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ అనుబంధంగా కార్యవర్గాన్ని ప్రకటించారు. అధ్యక్షులుగా గౌరిశెట్టి రవికుమార్ ( దిశా), ప్రధాన కార్యదర్శిగా గజవాడ నాగరాజు (సాక్షి), ఉపాధ్యక్షులుగా నక్క మహేష్ (సూర్య), శ్యాంసుందర్ (నవ తెలంగాణ), కోశాధికారిగా దండు అనిల్ కుమార్ (ఆంధ్ర జ్యోతి), సంయుక్త కార్యదర్శులుగా పరశురాం గౌడ్ (మన తెలంగాణ), శేఖర్ గౌడ్ (నమస్తే తెలంగాణ), సంతోష్ రెడ్డి ( ఈనాడు), ముఖ్య సలహాదారులుగా జంగం బాల ప్రకాష్ (ఆంధ్ర ప్రభ) ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తామని చెప్పారు. మండలంలో నకిలీ విలేకరుల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని వారు సూచించారు. ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా తాము పని చేస్తామని ఈ సందర్భంగా వారు ప్రతిజ్ఞ చేశారు.