last-minute-comeback : చరిత్రలోనే అద్భుతం Andhra Prabha Sports Story
last-minute-comeback : చరిత్రలోనే అద్భుతం Andhra Prabha Sports Story
- బెల్జియం షూట్…
- సెనెగల్ ఔట్
- ఫిఫా 16 బెర్త్ లో రెడ్ డెవిల్స్
- జైంట్ కిల్లర్స్ స్వీయ అపరాధం
- 3-2 గోల్స్ తో బెల్జియం మరో విజయ చరిత్ర
( ఆంధ్రప్రభ, క్రీడాప్రతినిధి)

షిపా వరల్డ్ కప్ చరిత్రలోనే… రెండు సంచలనాత్మక జట్లు గురువారం మరో కొత్త రికార్డు సృష్టంచాయి. నరాలు తెగే ఉత్కంఠతతో.. మాచ్ అదనపు సమయం తీసుకుని మరీ క్షణ క్షణం ఫుట్ బాల్ అభిమానులను బొటన వేలుపై ఈ రెండు జట్లు నిలబెట్టాయి. ఔను అమెరికా వాషింగ్టన్ స్టేట్‌లోని సీయాటిల్ స్టేడియంగా పేరొందిప లూమెన్ ఫీల్డ్ స్టేడియం లో… ది రెడ్ డెవిల్స్.. జైంట్ కిల్లర్స్ .. మధ్య 125 నిముఫాల పాటు సాగిన హోరాహోరీ పోరులో… ఫెనాల్టీ షూట్ ఔట్ చాన్స్ తో… సెనగల్ జట్టుపై బెల్జియం విజయం సాధించి.. టాప్ 16 బెర్త్‌ను ఖాయం చేసుకుంది. ఫుట్‌బాల్ చరిత్రలోనే అత్యంత ఉత్కంఠభరితంగా బెల్జియం, సెనెగల్ జట్లు తలపడ్డాయి. . 85వ నిమిషం వరకు 0-2 గోల్స్ తేడాతో… ఓటమి అంచులో నిలబడిన బెల్జియం జట్టు అనూహ్య రీతిలో పుంజుకుని 3-2 తేడాతో సంచలన విజయ చరిత్రను సృష్టించింది. ఒక రకంగా.. తమ జట్లు సాకర్ పౌల్ కారణంగా సెనగల్ .జట్టు భారీ మ ఊల్యం చెల్లించి .. ఓటమిని మూటగట్టుకుంది.
last-minute-comeback : రెడ్ డెవిల్స్ బ్రేక్

మ్యాచ్ ప్రారంభం నుండి సెనెగల్ సాకర్లు చిరుత వేగంతో.. 25వ నిమిషంలో సెనెగల్ సాకర్ సాడియో మానే అందించిన అద్భుత క్రాస్‌ను సార్ హెడర్ చేయగా అది పోస్ట్‌కు తగిలి వెనక్కి వచ్చింది. అక్కడే సిద్ధంగా ఉన్న హబీబ్ దియారా సులువుగా బంతిని నెట్‌లోకి పంపి సెనెగల్‌కు 1-0 ఆధిక్యాన్ని అందించాడు. సెకండ్ హాఫ్ ప్రారంభంలోనే (51వ నిముషం) మూసా నియాఖటే లాంగ్ బాల్‌ను అద్భుతంగా ఛాతీతో నియంత్రించి, బెల్జియం డిఫెండర్లను బోల్తా కొట్టిస్తూ ఇస్మాయిలా సార్ అద్భుత గోల్ చేశాడు. సెనెగల్ 2-0తో పటిష్ట స్థితికి చేరింది.
last-minute-comeback : ఆఖరి నిముషంలో.. అద్భుతం
ఇక బెల్జియం బిత్తర పోయింది. సెనెగల్ డిఫెన్స్ ను చేధించటానికి తిప్పలు పడింది. ఇంకా మ్యాచ్ కు 5 నిముషాల టైమ్ మాత్రమే మిగిలింది. ఇక బెల్జియం ఓడిపోయినట్టేనని సాకర్ అభిమానులు కంగారెత్తారు. కానీ 86 ఇ నిముషంలోనే.. అనూహ్య అద్భుతం జరిగింది. ఓటమి అంచుల్లో ఉన్న సమయంలో (86వ నిముషం) , సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన స్టార్ స్ట్రైకర్ రొమేలు లుకాకు క్లోజ్-రేంజ్ ఫినిషింగ్‌తో తొలి గోల్ కొట్టి బెల్జియం ఆశలు సజీవం చేశాడు. మ్యాచ్ ఆఖరి 89వ నిమిషంలో లియాండ్రో ట్రోసార్డ్ అందించిన క్రాస్‌ను బెల్జియం కెప్టెన్ టైల్‌మన్స్ పవర్‌ఫుల్ హెడర్ ద్వారా గోల్‌గా మలిచాడు. అంతే.. స్కోరు 2-2తో సమమై మ్యాచ్ ఎక్స్‌ట్రా టైమ్‌కు దారితీసింది.
last-minute-comeback : నరాలు తెగే పెనాల్టీ

ఎక్స్‌ట్రా టైమ్ ముగిసి మ్యాచ్ పెనాల్టీ షూటౌట్ వైపు వెళ్తున్న వేళ (120వ నిమిషంలో సెనెగల్ బాక్స్‌లో టైల్‌మన్స్‌ను లామిన్ కమారా ఫౌల్ చేశాడు. సుదీర్ఘ వీడియో అసిస్టెంట్ రిఫరీ రివ్యూ అనంతరం అంపైర్ బెల్జియానికి పెనాల్టీ ఇచ్చారు. యూరి టైల్‌మన్స్ ఎలాంటి ఒత్తిడి లేకుండా పెనాల్టీని టాప్ కార్నర్‌లోకి పంపి 3-2తో బెల్జియంకు చారిత్రాత్మక విజయాన్ని అందించాడు. రెండు గోల్స్ చేసి అద్భుత పునరాగమనానికి కారణమైన బెల్జియం కెప్టెన్ యూరి టైల్‌మన్స్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ప్రపంచకప్ నాకౌట్ మ్యాచ్‌లలో బెల్జియం 2 గోల్స్ వెనుకబడి ఉండి కూడా మ్యాచ్ గెలవడం ఇది రెండోసారి. 2018 రౌండ్ ఆఫ్ 16లో జపాన్‌పై 3-2 తేడాతో విజయం సాధించింది. ఈ అద్భుత విజయంతో రౌండ్ ఆఫ్ 16కు చేరిన బెల్జియం, జులై 6న జరగబోయే మ్యాచ్‌లో యూఎస్‌ఏ (USA) లేదా బోస్నియా విజేతతో తలపడనుంది,
