బీజేపీ నేత‌ ర‌ఘుప‌తి అరెస్టు

బీజేపీ నేత‌ ర‌ఘుప‌తి అరెస్టు

ఉమ్మ‌డి ఆదిలాబాద్ బ్యూరో : భూ ఆక్ర‌మ‌ణ కేసులో బీజేపీ నేత (BJP leader), మాజీ కౌన్సిల‌ర్‌, మావ‌ల మాజీ సర్పంచ్ ఉష్కం రఘుపతిని ఆదిలాబాద్ (Adilabad) పోలీసులు అరెస్ట్ చేశారు. అదిలాబాద్ (Adilabad) జిల్లా మావల పోలీస్ స్టేషన్ పరిధిలోని మావల శివారులోని 133/8/2, 133/8/3 సర్వే నెంబర్ లో నడిపి ఈర గంగన్న, నడిపి ఈర లక్ష్మి దళితుల పేరిట ఉన్న 6 ఎకరాల 25 గుంటల అసైన్డ్ భూమిలో దౌర్జన్యం చేసి జేసీబీలతో ఆక్రమించే ప్రయత్నం చేశారని బాధితులు ఎస్పీకి ఫిర్యాదు చేశారు.

బాకీ కింద తీసుకున్న డబ్బులకు బదులుగా తమ భూమిని కబ్జా చేశారని వారు పేర్కొన్నారు. దౌర్జన్యం బెదిరింపుల కేసుతో పాటు అట్రాసిటీ కేసు మావల పోలీస్ స్టేషన్ లో నమోదు చేసి ఉష్కం రఘుపతిని రిమాండ్ కు తరలించినట్టు డీఎస్పీ జీవన్ రెడ్డి (DSP Jeevan Reddy) తెలిపారు.

Leave a Reply