Ghattuppal | కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో

Ghattuppal | కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో

  • కబడ్డీ పోటీలు ప్రారంభం

Ghattuppal | గట్టుప్పల, ఆంధ్రప్రభ : నల్లగొండ జిల్లా గట్టుప్పల మండల కేంద్రంలో కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ సంక్రాంతి కబడ్డీ సంబరాలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సీజన్ వన్ ఎంతో అట్టహాసంగా ఈరోజు ప్రారంభమయ్యాయి. గ్రామ సర్పంచ్ నామని జగన్నాథం, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు దండు యాదగిరిరెడ్డి, దోర్నాల అంజయ్యతో కలిసి కబడ్డీ పోటీలను ప్రారంభించారు.

అనంతరం క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ.. క్రీడల వలన మానసిక ఉల్లాసం కలుగుతుందని, శరీరం దృఢంగా తయారవుతుందన్నారు. కబడ్డీ పోటీలో 32జట్లు పాల్గొంటున్నాయని, విజేతలకు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రేపు బహుమతులు అందజేస్తారని నిర్వాహకులు దోర్నాల భరద్వాజ్ తెలిపారు.

ఈకార్యక్రమంలో ఉప సర్పంచ్ ఖమ్మం లక్ష్మయ్య, మార్కెట్ కమిటీ డైరెక్టర్ మోదుగు బాల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు సామల యాదయ్య, చెరుపల్లి సత్తయ్య, యిడం గణేష్, భీమగాని మల్లేష్, పెద్దగాని నరేందర్, మొద్దు గణేష్, లడే యాదయ్య, పున్న శివ, మాధగాని సత్తయ్య, ఖమ్మం శ్రీను, గంట శ్రీశైలం, గంట రమేష్, క్రాంతి కుమార్, భాను, నవీన్, మొద్దు నవీన్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply