Bengal politics analysis | బెంగాల్‌లో ఓటర్ల జాబితా వివాదం

Bengal politics analysis | బెంగాల్‌లో ఓటర్ల జాబితా వివాదం
Bengal politics analysis | ముస్లిం ఓట్లలో చీలికల వాస్తవం
తృణమూల్ vs బీజేపీ రాజకీయ సమీకరణాలు
ఓటు బ్యాంకు రాజకీయాల మారుతున్న ధోరణి
మహిళా రిజర్వేషన్లు ఎన్నికలపై ప్రభావం
ప్రజాస్వామ్యం, సమతుల్యతపై చర్చ
Bengal politics analysis | ముస్లింల ఓట్లు గంపగుత్తగా పడతాయనుకోవడం ఓ మిథ్య. అనేక కారణాల రీత్యా ముస్లిం సమాజంలో ఓట్లు చీలిపోయే అవకాశం ఉంది. బెంగాల్‌లో ఓటర్ల జాబితా ముమ్మర సవరణ కార్యక్రమం (ఎస్‌ఐఆర్) అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధానాంశం అయింది. బెంగాల్‌తో పాటు కేరళ, తమిళనాడు, అసోంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగినా, బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు దేశవ్యాప్తంగా అందరినీ ఆకర్షించాయి. బెంగాల్‌లో ఆ ప్రాధాన్యం ఏమిటి? కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ 2014 నుంచి బెంగాల్‌లో అధికారంలోకి రావడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోంది. హిందువులను సమీకరించడం ద్వారా అప్పటి నుంచి బీజేపీ ఈ రాష్ట్రంలో పాగా వేసేందుకు ప్రయత్నిస్తోంది. హిందువుల ప్రయోజనాలను కాపాడుతామని వాగ్దానాలు చేస్తోంది. ఈసారి మాత్రం బెంగాల్‌లో ఎస్‌ఐఆర్ పేరు చెప్పి ఓటర్లను ఆకర్షించేందుకు రాష్ట్రంలో అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ విస్తృతంగా ప్రచారం చేసింది. ఎన్నికల ముందు జరిగిన ఓటర్ల జాబితా సవరణలో ముస్లింలు, ఇతర మైనారిటీల ఓట్లు అధిక సంఖ్యలో తొలగింపబడ్డాయని గార్డియన్ పత్రిక పేర్కొంది.

రాష్ట్రంలో ముస్లింలు ముఖ్యమంత్రి, తృణమూల్ అధ్యక్షురాలు మమతా బెనర్జీకి మద్దతు ఇస్తారని ఇప్పటికీ విశ్వసిస్తున్నారు. అయితే, ముస్లిం సమాజంలో అనేక కారణాల వల్ల చీలికలు వచ్చాయి. ఓట్ల తొలగింపును తృణమూల్ కాంగ్రెస్ ఓట్ల దొంగతనంగా అభివర్ణించింది. అయితే, ఈసారి ముస్లింల ఓట్లు గతంలో మాదిరి సూటిగా లేవని భావిస్తున్నారు. గతంలో తృణమూల్‌లో ఉన్న హుమాయూన్ కబీర్ ఆ పార్టీ నుంచి బయటికి వచ్చారు. ఆ పార్టీకి ఆలిండియా ఎంఐఎం పార్టీ మద్దతు ఇచ్చింది. రాష్ట్రంలో 30 లక్షల మంది ముస్లిం ఓటర్లు ఉన్నారు. ముస్లింల ప్రయోజనాలను కాపాడే ఏకైక ప్రతినిధులమని చెప్పుకుంటూ ఇంతకాలం కొందరు నాయకులు ఓటు బ్యాంకు రాజకీయాలను నడుపుకుంటూ వచ్చారు. దానికి తగినట్టు లౌకిక వాదం పేరు చెప్పి ముస్లింల ఓట్లను కూడగట్టేందుకు ప్రయత్నించేవారు. ఇప్పుడు పరిస్థితి మారింది. ముస్లింలలో ఏకీభావం లేదు. తమ ప్రాధాన్యక్రమాన్ని బట్టి వ్యక్తులనూ, నాయకులనూ సమర్థిస్తున్నారు.
ఉత్తరప్రదేశ్‌లో ఈ ధోరణిని నేను దగ్గర నుంచి పరిశీలిస్తూ వచ్చాను. మా కుటుంబంలోనే కొందరు కాంగ్రెస్‌ను సమర్థించగా, మరికొందరు సమాజ్‌వాదీ పార్టీని సమర్థిస్తూ వచ్చారు. ఇప్పుడు ఆప్ పార్టీకి మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే, బీజేపీకి మద్దతు ఇచ్చేవారిని ఇంతవరకు చూడలేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్దుబాట్ల సంగతి వేరే విషయం. ఈ క్రమంలో బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ లౌకిక వాద పార్టీగా జనం ముందుకు వచ్చింది. ఆ పార్టీకి ముస్లింల మద్దతు లభించింది. కాంగ్రెస్ కనుమరుగైన తర్వాత ముస్లింల ఓట్లు తృణమూల్‌కు పడుతూ వస్తున్నాయి. అయితే, ఓటు విషయంలో నిర్ణయాలు తీసుకోవడంలో ముస్లింలకు కేంద్రీకృత వ్యవస్థ ఒకటి ఉంది. మొత్తం ఆ సామాజిక వర్గం శక్తివంతమైన ఓటు బేస్‌గా రూపుదిద్దుకుంది. ముస్లింలంతా సాధారణంగా మితవాద, మతవాద శక్తులకు దూరంగా ఉంటారు. వారి విధానాలు, కార్యక్రమాలు వేరుగా ఉంటాయి.
మహిళల రిజర్వేషన్లు : ఇప్పుడు మహిళల రిజర్వేషన్ల గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మహిళల ఓట్ల కోసం అన్ని పార్టీలూ ప్రయత్నించాయి. అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ ఇతర పార్టీల కన్నా ఎక్కువ మంది మహిళా అభ్యర్థులను నిలబెట్టింది. ఆ పార్టీ అధ్యక్షురాలు మమతా బెనర్జీ ఈ ఎన్నికల్లో మహిళా అభ్యర్థినులకు ప్రాధాన్యం ఇచ్చారు. ముస్లింలలో మహిళలకు సమాన హక్కులు, హోదాలు లేవు. అటువంటి వర్గంలో ఈసారి మహిళలకు ఎక్కువ మందికి టికెట్లు ఇచ్చి ఎన్నికల్లో నిలబెట్టారు. ఎస్‌ఐఆర్‌కు వ్యతిరేకంగా అనేకమంది ఈసారి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈసారి ఎన్నికల్లో ఎవరు నెగ్గుతారనేది వేరే విషయం. ప్రజాస్వామ్యం ఖతం అయింది అనే చర్చ కూడా వినిపిస్తోంది. ఈ ఎన్నికలు రాజకీయ అధికారాన్ని సమతుల్యం చేస్తాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ ఎన్నికల్లో మహిళలకు ప్రాధాన్యం లభించింది. ఎంత మంది నెగ్గుతారనేది చర్చ సాగుతోంది. మొత్తం మీద ఎస్‌ఐఆర్, మహిళా బిల్లు అంశాలు ఈ ఎన్నికల్లో ఎక్కువ ప్రాధాన్యం వహించాయని చెప్పవచ్చు.
- అమనా బేగం అన్సారీ@Amana-Ansari
కాలమిస్టు, రచయిత్రి
