శ్రీశైలం : శ్రీశైలం (srisailam) పదో గేటు (tenth gate ) నుంచి నీరు లీకేజ్ (water Leak ) అవుతున్న నేపథ్యంలో నేడు శ్రీశైలం ప్రాజెక్ట్ ను గేట్ల నిపుణుడు కన్నయ్యనాయుడు (kannaiah naidu ) పరిశీలించారు. . ఆనకట్ట రేడియల్ క్రస్ట్‌గేట్ల పరిస్థితిని క్షుణ్ణంగా పరిశీలించిన ఆయన పదో నంబర్ గేట్ ద్వారా వచ్చే లీకేజీ వల్ల ఇబ్బందేమీ లేదన్నారు. గేటు నుంచి నీటి లీకేజీ 10శాతం కంటే తక్కువగా ఉందని తెలిపారు. రేడియల్ క్రస్ట్ గేట్లకు క్రమం తప్పకుండా పెయింటింగ్ వేయాలని సూచించారు.
మరో ఐదేళ్లకైనా రేడియల్ క్రస్ట్ గేట్లు కొత్తవి ఏర్పాటు చేయాల్సిన అవసరముందన్నారు. కొత్త గేట్లు ఏర్పాటు చేయకపోతే తుంగభద్ర పరిస్థితి ఎదురయ్యే ప్రమాదం ఉందన్నారు. శ్రీశైలం ప్రాజెక్టు గేట్ల నిర్వహణకు ప్రభుత్వం నిధులు కేటాయించాలని కోరారు. ఆనకట్ట నుంచి 60 మీటర్ల దూరంలో ప్లంజ్‌పూల్ ఉందని, దాని వల్ల శ్రీశైలం ఆనకట్టకు ప్రమాదం లేదన్నారు. అయినప్పటికీ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ మరమ్మతులు చేయాలని సూచించారు. ప్రాజెక్ట్ ల భద్రత విషయంలో ఎటువంటి రాజీ పడకూడదని ఆయన అధికారులకు సూచించారు.