Bellampally | మున్సిపాలిటీలో 34 స్థానాలూ గెలుచుకుంటాం

Bellampally | మున్సిపాలిటీలో 34 స్థానాలూ గెలుచుకుంటాం

  • ఎమ్మెల్యే గడ్డం వినోద్, డీసీసీ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి
  • భ్యర్థులకు బీ-ఫారాలు అందజేత
  • టికెట్లు రాని వారు నిరాశ చెందవద్దు..
  • పదవులు ఇస్తాం – కాంగ్రెస్ విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

Bellampally | బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలు, చేపడుతున్న అభివృద్ధి పనులే ఈ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తాయని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు (డీసీసీ) పిన్నింటి రఘునాథ్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం బెల్లంపల్లిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు అభ్యర్థుల తుది జాబితాను విడుదల చేసి, వారికి బీ-ఫారాలను అందజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బెల్లంపల్లి మున్సిపాలిటీలోని మొత్తం 34 వార్డుల్లోనూ కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని స్పష్టం చేశారు. పార్టీ అధిష్టానం, ఇంటలిజెన్స్ వర్గాలు మరియు ప్రజల నుంచి సేకరించిన అభిప్రాయాల మేరకు గెలిచే అవకాశం ఉన్న వారికే టికెట్లు కేటాయించామని వివరించారు. రానున్న రోజుల్లో పట్టణాన్ని అన్ని విధాలా అభివృద్ధి పథంలో నడిపిస్తామని హామీ ఇచ్చారు.

టికెట్లు దక్కని వారు అసంతృప్తి చెందవద్దని, ప్రభుత్వం అధికారంలో ఉన్నందున వారికి భవిష్యత్తులో తగిన ప్రాధాన్యత కల్పిస్తూ సంస్థాగత పదవులు ఇస్తామని భరోసా ఇచ్చారు. “పార్టీ కోసం పనిచేసిన ప్రతి కార్యకర్తను గౌరవించుకుంటాం. టికెట్లు రాని వారికి భవిష్యత్తులో ప్రభుత్వం మరియు పార్టీలో కీలకమైన సంస్థాగత పదవులను అప్పగిస్తాం” అని భరోసా ఇచ్చారు. ప్రతి ఒక్కరూ విభేదాలు పక్కన పెట్టి, పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం సమన్వయంతో కృషి చేయాలని పిలుపునిచ్చారు.

కాంగ్రెస్ వార్డు కౌన్సిలర్ అభ్యర్థులు వీరే…

1వ వార్డు నుండి మాదరి లక్ష్మి, 2వ వార్డులో గోమాస ప్రవీణ్ కుమార్, 3వ వార్డులో పొరండ్ల సత్యవతి, 4వ వార్డులో పంగ శాంత, 5లో పేరాపల్లి పరమేష్‌లకు అవకాశం దక్కింది. అలాగే 6వ వార్డులో దుబాసి వెంకటస్వామి, 7వ వార్డులో దావ స్వాతి, 8లో ఎండి. నిజాముద్దీన్, 9లో రొడ్డ శారద, 10లో డీకొండ పద్మ బరిలో నిలిచారు. అంతేకాకుండా 11వ వార్డు లో వార్డు నుండి గాలి సుమలతను అభ్యర్థిగా ప్రకటించగా, 12వ వార్డులో జరుపుల లక్ష్మి, 13వ వార్డులో బండి ఉమ, 14లో ముక్కెర సోమశేఖర్, 15వ వార్డులో చింతల వసంతలు టికెట్ దక్కించుకున్నారు.

16వ వార్డులో రేగుంట రమాదేవి, 17లో రాగం శెట్టి సత్యనారాయణ, 18వ వార్డులో తస్లీమ్ సుల్తానా, 19వ వార్డులో కాంపెల్లి దయమణి, 20వ వార్డులో మత్తమారి సరస్వతి, 21లో ఎలుక ఆకాష్‌లు పోటీ చేయనున్నారు. వీరితో పాటు 22వ వార్డు నుండి ఆకుల లలిత, 23వ వార్డులో జంగం కల్పన, 24వ వార్డులో దామెర విజయలత, 25లో కంకటి ప్రణీత, 26లో ఇప్ప కుమారస్వామి, 27వ వార్డులో బేతి శ్రావణ్ కుమార్ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. చివరగా 28లో చిప్ప అర్చన, 29లో మేడి పున్నం చంద్, 30లో గెల్లి విజయలక్ష్మి, 31వ వార్డులో గెల్లి సంధ్య, 32వ వార్డులో నీలి హారిక, 33వ వార్డులో బండి రజిత మరియు 34వ వార్డు నుండి గాదం కవితలు కాంగ్రెస్ తరపున బరిలో ఉంటారని ఈ సందర్భంగా బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు (డీసీసీ) పిన్నింటి రఘునాథ్ రెడ్డి లు వివరించారు.

Leave a Reply