వైభవంగా హెర్సపెన్ జల్దేవర దేవుళ్ల నూతన ఆలయం ప్రారంభం

కడెం, ఆంధ్రప్రభ : కడెం మండలంలోని చిట్యాల్ గోండుగూడ గ్రామంలో ఆదివాసి పేందూర్ వంశస్తుల కులదైవమైన హెర్సపెన్ జల్దేవర దేవుళ్ల నూతన ఆలయాన్ని నిర్మించారు. ఈ సందర్భంగా మహారాష్ట్రలోని ఇంద్రవెల్లి ప్రాంతానికి చెందిన పూజారులు, స్థానిక పూజారులతో కలిసి నూతన ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయాన్ని ప్రారంభించారు.

ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైన భక్తులు, గ్రామస్తుల కోసం అన్నదానం ఏర్పాటు చేశారు. కార్యక్రమం ఎంతో వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో చిట్యాల్ గ్రామ సర్పంచ్ చీమల భీమేష్, ఉపసర్పంచ్ భగవంతరావు, జీపీ వార్డు సభ్యులు, మాజీ సర్పంచ్ అరక మధు, చిట్యాల్ గ్రామ పేందూర్ వంశీయులు పటేల్ పేందూరు లింభారావు, గ్రామ పెద్దలు, గోండుగూడెం గిరిజనులు, వివిధ గ్రామాల నుండి వచ్చిన గోండు గిరిజనులు మరియు భక్తులు పాల్గొన్నారు.

Leave a Reply