Rs. 100 crore | రూ.100 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు

Rs. 100 crore | రూ.100 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు

  • జీఎస్టీ నమోదులో ఆలస్యం వద్దు
  • జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

Rs. 100 crore | చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో : జిల్లాలో సుమారు రూ.100 కోట్ల వ్యయంతో పలు అభివృద్ధి పనులు చేపడుతున్నామని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ వెల్లడించారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్‌లో నిర్వహించిన జీఎస్టీ అమలు సమీక్ష సమావేశంలో ఆయన సంబంధిత శాఖల అధికారులతో విస్తృతంగా చర్చించారు. అభివృద్ధి పనులు వేగంగా, పారదర్శకంగా పూర్తి కావాలంటే పన్ను విధానాల అమలు కచ్చితంగా ఉండాలని, శాఖల మధ్య సమన్వయం మరింత బలోపేతం కావాలని ఆయన స్పష్టం చేశారు.

పీఎం అజయ్ పథకం కింద గృహ నిర్మాణ శాఖ ద్వారా జరుగుతున్న అన్ని పనులను తప్పనిసరిగా వెబ్ పోర్టల్‌లో నమోదు చేయాలని, వాటికి సంబంధించిన జీఎస్టీ నమోదు ప్రక్రియలో ఎలాంటి ఆలస్యం ఉండకూడదని కలెక్టర్ ఆదేశించారు. జీఎస్టీ చెల్లింపులకు సంబంధించి దరఖాస్తులు సమర్పించినప్పటికీ అనవసర జాప్యం జరుగుతోందని, దీని వల్ల చెల్లింపుల ప్రక్రియతో పాటు డేటా సమగ్రత కూడా ప్రభావితమవుతోందని ఆయన పేర్కొన్నారు. చిన్న మొత్తాల పనులైనా సరే శాఖల మధ్య పరస్పర అవగాహనతో సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సూచించారు.

Rs. 100 crore |

ప్రతి నెల మొదటి వారం లోపు జీఎస్టీ చెల్లింపులు పూర్తిచేయడం బాధ్యతగా తీసుకోవాలని, అలాగే ప్రతి నెల జీఎస్టీ అధికారులు వసూలు చేస్తున్న రెవెన్యూ వివరాలను సమగ్ర జాబితా రూపంలో సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు. నకిలీ పన్ను చెల్లింపుదారులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని జీఎస్టీ అధికారులకు స్పష్టం చేశారు.

Rs. 100 crore |

కుప్పం నియోజకవర్గంలో సుమారు రూ.29 కోట్ల విలువైన అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు. ఎస్సీ, ఎస్టీ కాలనీల అభివృద్ధి, పీఎం సూర్య ఘర్, పీఎం కుసుమ్ పథకాలు, హాస్టల్ భవనాల నిర్మాణాలు తదితర పనులు ఇందులో భాగంగా ఉన్నాయని వివరించారు. ఈ పనులన్నింటిలో పన్ను విధానాలు సక్రమంగా అమలవుతాయో లేదో పర్యవేక్షించాలని సూచించారు.

Rs. 100 crore |

వాణిజ్య పన్నుల శాఖ ద్వారా గుర్తించబడిన బకాయిలు ఉన్న పన్ను చెల్లింపుదారులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, అవసరమైతే వారి పన్ను లావాదేవీలను నిలిపివేసే చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. దీనికి సంబంధించి డిఆర్ఓ, రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు, సబ్-రిజిస్ట్రార్లతో కలిసి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ చర్యల ద్వారా రిజిస్ట్రేషన్ వ్యవహారాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు గణనీయంగా తగ్గుతాయని అభిప్రాయపడ్డారు.

ప్రభుత్వ పన్నులు సకాలంలో చెల్లించడం ప్రతి శాఖ బాధ్యతగా తీసుకోవాలని, ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను మార్చి 31 లోపు సాధించేలా ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. అభివృద్ధి పనులు, పన్ను వసూళ్లు, డేటా నిర్వహణ ఈ మూడు అంశాల్లో క్రమశిక్షణతో ముందుకు సాగితే జిల్లాకు ఆర్థిక బలం చేకూరుతుందని ఆయన తెలిపారు.

ఈ సమావేశంలో డిఆర్ఓ మోహన్ కుమార్, జాయింట్ కమిషనర్ కమర్షియల్ టాక్స్ అధికారి రవీంద్రనాథ్ రెడ్డి, డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ పరదేశి నాయుడు తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply