TG | పంచాయతీ రిజర్వేషన్లలో బిసిలకు తీవ్ర అన్యాయం

TG | పంచాయతీ రిజర్వేషన్లలో బిసిలకు తీవ్ర అన్యాయం
బీసీ నేతల ఆందోళన!
TG | ఉమ్మడి ఆదిలాబాద్, ఆంధ్రప్రభ : బీసీ రిజర్వేషన్లపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం (Revanth Reddy government) చెప్పేదొకటి, చేసేది మరోలా ఉందని, రిజర్వేషన్ల ఖరారుతోనే ప్రభుత్వ నైజo బయటపడిందని బీసీ సంఘాల నేతలు ఆరోపించారు. ఆదిలాబాద్ జిల్లాలో బీసీల రిజర్వేషన్ల లో మొండి చేయి చూపారని, వీటిని మార్చాలని డిమాండ్ చేశారు. సర్పంచ్ రిజర్వేషన్ లలో కాంగ్రెస్ ప్రభుత్వం బిసిలకు తీవ్ర అన్యాయం చేసిందని ఆరోపిస్తూ ఆదిలాబాద్ కలెక్టర్ కార్యలయం వద్ద బీసీ నాయకులు ధర్నా చేశారు.
2019 ఎన్నికల్లో జిల్లాలో బిసిలకు 23% రిజర్వేషన్ ఇస్తే, ఈ సారీ కేవలం 11% మాత్రమే ఇచ్చారనీ వారు పేర్కొన్నారు.,2019 లో జిల్లాలో 83 పంచాయతీలకు బీసీ రిజర్వేషన్ కల్పిస్తే ఈ సారీ కేవలం 23 మాత్రమే ఖరారు చేయడం విడురంగా ఉందన్నారు. ప్రభుత్వం కామారెడ్డి బీసీ డిక్లరేషన్ పేరిట 42% రిజర్వేషన్ ఇస్తానని చెప్పి మోసం చేసిందని, పాత రిజర్వేషన్ పద్దతి ప్రకారం (According to the old reservation system) కనీసం 23% రిజర్వేషన్ బిసిలకు ఇవ్వాలన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం జిల్లాలో కేవలం 11% మాత్రమే బిసిలకు రిజర్వేషన్ ఇచ్చి మోసం చేశారని ఆరోపించారు. కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించిన వారిలో ముఖరా కే మాజీ సర్పంచ్ గాడ్గే మీనాక్షి, మాజీ ఎంపీటీసీ గాడ్గే సుభాష్, కిరణ్, వెంకట్ రావ్ వెంకటి, తులసిరాం, రూసికేష్, నాయకులు పాల్గొన్నారు.
