4 thousand | అడవుల్లో అమాయకులు చస్తున్నారు..

4 thousand | అడవుల్లో అమాయకులు చస్తున్నారు..

  • అర్బన్ నక్సల్స్ దర్జాగా జీవిస్తున్నారు..
  • వారి కుటుంబాల గుండె కోత మీకేలా తెలుస్తుంది..
  • ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రశ్నించరా..?
  • హామీల అమలుపై ఉద్యమించరా..?
  • తుపాకీని సమర్ధించిన వాళ్లు కూడా నేరస్తులే..
  • మార్చిలోపు మావోయిజాన్ని అంతమొందిస్తాం..
  • కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్హు

4 thousand | జూరాబాద్, ఆంధ్రప్రభ : అమాయక నక్సలైట్లు అడవుల్లో చనిపోతుంటే.. వారిని రెచ్చగొట్టి నక్సలిజం వైపు మళ్లించిన అర్బన్ నక్సలైట్లు మాత్రం ఆస్తులు కూడగట్టుకుని ప్రభుత్వ నామినేటెడ్, కమిషన్ పదవుల్లో కొనసాగుతున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్(Minister Bandi Sanjay) ధ్వజమెత్తారు.

ఈ రోజు కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. దళిత, గిరిజన, ఆదివాసీ అమాయకులను రెచ్చగొట్టి నక్సలైట్లుగా మార్చిన అర్బన్ నక్సలైట్లే వారి చావులకు కూడా బాధ్యత వహించాల్సిందేనన్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడటమే తమ సిద్ధాంతమని పదేపదే చెప్పుకునే అర్బన్ నక్సలైట్లు.. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎందుకు పదవుల్లో కొనసాగుతున్నారని ప్రశ్నించారు. అధికారంలో ఉన్నా లేకున్నా మావోయిజానికి బీజేపీకి వ్యతిరేకమని, తుపాకీ గొట్టం ద్వారా రాజ్యాధికారం అసాధ్యమని స్పష్టం చేశారు.

మావోయిస్టుల పేరుతో అమాయకులను బలి తీసుకున్నారని, అమాయక పిల్లలను రెచ్చగొట్టి వాళ్ల ప్రాణాలను బలిగొనడానికి ప్రధాన కారణం అర్బన్ నక్సల్స్(Urban Naxals) మాత్రమేనన్నారు. ఇవ్వాల చనిపోయిన కుటుంబాలకు ఏం జవాబు చెబుతారని, పిల్లలు చనిపోతే తల్లిదండ్రుల గుండె ఎంతగా శోకిస్తుందో, భర్త చనిపోతే భార్య, భార్య చనిపోతే భర్త ఎంత దు:ఖానికి గురవుతారో ఈ అర్బన్ నక్సల్స్ కు తెలియదా..? అని మండిపడ్డారు.

అర్బన్ నక్సలైట్ల విషయంలో చెప్పిన మాటకు కట్టుబడి ఉంటానని, మీడియా, సోషల్ మీడియా(Social Media) ద్వారా రెచ్చగొడుతున్న అర్బన్ నక్సల్స్ అమాయక మావోయిస్టులు చావుకు మీరే బాధ్యత వహించాలన్నారు. అర్బన్ నక్సల్స్, పౌర హక్కుల సంఘం నాయకులంతా పాలకులు ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేపడితే, ప్రజలకు నష్టం జరిగితే ఉద్యమాలు చేయాలని డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వంలో నామినేటెడ్ పదవుల్లో, కమిషన్ పోస్టుల్లో(Commission posts) ఎట్లా భాగస్వాములు అయ్యారని ప్రశ్నించారు. మహిళలకు నెలకు రూ.2500లు ఇస్తామన్నారని, వృద్ధులకు రూ.4 వేల పెన్షన్(Rs 4 thousand pension) ఇస్తామన్నారని, ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులకు అనేక హావి కలిచ్చారని గుర్తు చేశారు. అర్బన్ నక్సల్స్ పైరవీలు చేస్తూ, ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆస్తులు కూడగట్టుకుంటున్నారనే మాటకు ఇప్పటికి కట్టుబడి ఉన్నానన్నారు.

ప్రధాని మోదీ(Prime Minister Modi) నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ఆర్థిక ప్రగతిలో భారత్ను 4వ స్థానానికి చేర్చామన్నారు. విదేశాధి నేతలే మోదీకి సాష్టాంగ పడుతుంటే మీకు కన్పించడం లేదా..? అన్నారు. అడవులో అన్నలను అర్బన్ నక్సల్స్ రెచ్చగొడుతున్నారని, వారి ఆస్తులు కూడగడుతూ పదవులు అనుభవిస్తున్నారన్నారు. వాళ్ల మాటలు నమ్మి మోసపోవద్దని కోరారు. అమిత్ షా ఒక్క మాట ఇస్తే తప్పరని, వచ్చే మార్చి నాటికి మావోయిజాన్ని పూర్తిగా అంతం చేస్తామన్నారు.

ఇకనైనా నక్సలైట్లంతా లొంగిపోవాలని, వారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు(Central and State Governments) పూర్తిగా సాయం అందిస్తాయన్నారు. నక్సలిజాన్ని ఎవరు సమర్ధించినా వాళ్లు కూడా నేరస్తులేనని, మావోయిస్టులే తుపాకులు వదిలి జన జీవన స్రవంతిలో కలుస్తుంటే.. అందుకు భిన్నంగా అర్బన్ నక్సల్స్ తుపాకులు పట్టండి.. మావోయిస్టుల్లో చేరండి అంటే ఊరుకుంటామా..? అని బండి సంజయ్ మండిపడ్డారు.