GHMC జోన్లు, సర్కిల్స్ పెంచిన ప్రభుత్వం..

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) పరిధిలోని జోన్లు, సర్కిళ్ల సంఖ్యను భారీగా పెంచుతూ తెలంగాణ స‌ర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్త‌ర‌ర్వుల ప్ర‌కారం ప్రస్తుతం ఉన్న 6 జోన్లను 12 జోన్లకు, అలాగే ప్రస్తుతం ఉన్న 30 సర్కిళ్లను 60 సర్కిళ్లకు పెంచారు.

కొత్తగా ఉప్పల్, కుత్బుల్లాపూర్, మల్కాజ్‌గిరి, శంషాబాద్, గోల్కొండ, రాజేంద్రనగర్ జోన్లను ఏర్పాటు చేశారు. కొత్త జోనల్ కార్యాలయాలను ప్రస్తుతం ఉన్న సర్కిల్ కార్యాలయాల్లో, అలాగే కొత్త సర్కిల్ కార్యాలయాలను వార్డు కార్యాలయాల్లో ఏర్పాటు చేసి, త్వరలోనే వీటి ద్వారా పూర్తిస్థాయి పరిపాలనను ప్రారంభించనున్నారు.

మరోవైపు, GHMC వార్డుల పునర్విభజన (Delimitation) ప్రక్రియ కూడా ఒక కొలిక్కి వచ్చింది. తాజాగా అధికారులు 300 వార్డులతో కూడిన ఫైనల్ నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. ఈ నెల 9న ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత ప్రజలు, ప్రజాప్రతినిధుల నుంచి వచ్చిన 6,000కు పైగా అభ్యంతరాలను పరిశీలించిన అధికారులు ఈ తుది జాబితాను ఖరారు చేశారు.

పెరిగిన సర్కిళ్లు, వార్డుల వల్ల పౌర సమస్యల పరిష్కారం వేగవంతం కావడమే కాకుండా, క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ మరింత పటిష్టం కానుంది.

Leave a Reply