Bank | వెయ్యి నుంచి మూడు వేల పెన్షన్ నెలనెలా
Bank | వెయ్యి నుంచి మూడు వేల పెన్షన్ నెలనెలా
- యూనియన్ బ్యాంక్ మేనేజర్ మోహనరావు
Bank | వేంసూరు, ఆంధ్రప్రభ : 18 నుంచి 40 ఏళ్ళ వయస్సు మధ్య ఉన్న వారు నెలనెల పెన్షన్ పొందెందుకు యూనియన్ బ్యాంకు అందించే అటల్ పెన్షన్ యోజన పథకంలో చేరాలని బ్యాంకు మేనేజర్ మోహనరావు కోరారు. కేవైసీ అప్డేట్ విధానం పై బ్యాంకు ఖాతాదారుల సమావేశం వేంసూరు పంచాయతీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలికల కొరకు సుకన్య సమృద్ధి యోజన పథకం, ఇన్సూరెన్స్ పథకాల కొరకు ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన వంటి పథకాలను రూ.20 నుంచి 436 రూపాయలు సంవత్సరానికి చెల్లించటం ద్వారా రెండు లక్షలు ఇన్సూరెన్స్ పొందవచ్చు అన్నారు.
అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని, వ్యక్తిగత, బ్యాంకింగ్ వివరాలకు ఇతరులకు చెప్పవద్దని విజ్ఞప్తి చేశారు. సైబర్ నేరగాళ్ళు రకరకాల పద్ధతులలో బ్యాంక్ ఖాతాదారులను మోసం చేసే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పక్రుద్దీన్ ఆలీ అహ్మద్, కార్యదర్శి కిషోర్ బాబు, ఐకెపి ఎపిఎం సుబ్బారావు, వార్డు సభ్యులు, ఐకెపి సిబ్బంది, డ్వాక్రా మహిళలు, బ్యాంక్ సిబ్బంది, బ్యాంక్ ఖాతాదారులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
