చిట్యాలలో ఈదురుగాలులతో భారీ వర్షం..

చిట్యాలలో ఈదురుగాలులతో భారీ వర్షం..
జాతీయ రహదారిపై నీరు నిల్వ, వాహనదారులకు ఇబ్బందులు
చిట్యాల, ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్: చిట్యాల మండల కేంద్రంలో మంగళవారం రాత్రి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం సుమారు 40 నిమిషాల పాటు కురిసింది.
అనుకోకుండా కురిసిన వర్షం కారణంగా వ్యవసాయ మార్కెట్, ఐకెపి కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉన్న ధాన్యం తడిసిపోయింది. దీంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
జాతీయ రహదారిపై వర్షపు నీరు నిల్వ కావడంతో రవాణా అంతరాయం ఏర్పడింది. రహదారి విస్తరణ, వంతెన నిర్మాణ పనులు జరుగుతుండటంతో రైల్వే బ్రిడ్జి సమీపంలో నీరు చేరింది. దీంతో హైదరాబాద్, విజయవాడ వైపు వెళ్లే వాహనాలు నెమ్మదిగా కదిలాయి.
వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
