సిరిసిల్లలో బిఆర్ఎస్ నిరసన
సిరిసిల్లలో బిఆర్ఎస్ నిరసన
- బండి సంజయ్ ని బర్తరఫ్ చేయాలి
సిరిసిల్ల, ఆంధ్రప్రభ : కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ బిఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగాయి. సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో గులాబీ శ్రేణులు ఫోక్సో కేసులో బాధితురాలు కుటుంబానికి న్యాయం జరగాలంటే బండి సంజయ్ ని కేంద్ర మంత్రివర్గం నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. శాంతియుతంగా నిరసన చేస్తున్న గులాబీ స్త్రీల పై పండి అనుచరులు దూసుకురావడంతో ఉదిరిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఇరువర్గాలను పంపించేశారు.
