Bandi Sanjay : సన్ స్ట్రోక్.. Andhra Prabha Top Story

Bandi Sanjay : సన్ స్ట్రోక్.. Andhra Prabha Top Story

  • ఐసీయూ లోకి మినిస్టర్
  • రాజకీయ భవిష్యత్తుకు ముప్పు
  • కుమారుడి కేసులో సెల్ఫ్ గోల్స్

( హైదరాబాద్ ఆంధ్రప్రభ )

కైలాస పటం అందరికీ సుపరిచితమైన ఆట… చక చకా పైకి ఎక్కిన వారు అడుగు దూరంలో లక్ష్యం ఉందనగా పాము మింగడంతో పాతాళానికి చేరుకుంటారు. ఆట మళ్లీ మొదటి నుండి ప్రారంభమవుతుంది.. అచ్చు గుద్దినట్లుగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ రాజకీయ జీవితం ఉంది అనడంలో అతిశయోక్తి లేదు. తెలంగాణ బిజెపిలో అతి తక్కువ కాలంలో చకాచకా పైకి ఎగబాకి కౌన్సిలర్ నుండి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఎదిగాడు. ఎంత స్పీడుగా పైకి ఎదిగాడు అదే స్పీడ్ తో మళ్ళీ మొదటికి వచ్చే పరిస్థితి వచ్చింది. దీంతో కైలాస పటం ఆట బండికి అచ్చుగుద్దినట్లుగా ఉందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.. శాంతి భద్రతలు చూసే కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఏ మాత్రం పొరపాటు చేయడనుకున్నారు. కానీ తప్పు మీద తప్పు చేసి తన రాజకీయ భవిష్యత్తుకు ముప్పు తెచ్చుకున్నాడు కొడుకు భగీరథ ను కాపాడుకునేందుకు ఆయన చేసిన వ్యవహారం ఇలా తప్పులను చేయించింది కేసు ఫైల్ కాగానే కొడుకును సరెండర్ చేసి ఉంటే వ్యవహారం ఇంత క్లిష్టతరమయ్యేది కాదు. పోలీసులు మొదట్లో పెట్టిన ఫోక్సో లెవెన్ ప్రకారం స్టేషన్ బెయిలు వెంటనే వచ్చేది. కుమారుడు అని చూడకుండా చట్టాన్ని గౌరవించారనే ఖ్యాతి దక్కేది. రాజకీయ భవిష్యత్తుకు మరింత మంచి జరిగి మినిస్టర్ పదవికి ముప్పు ఉండేది కాదు. ఫలితంగా తగిలిన సన్ స్ట్రోక్ ఐసియూ లోకి మంత్రి పదవిని తీసుకెళ్ళింది. పోక్సో కేసు అంటే ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. కానీ కేంద్ర మంత్రిగా ఉన్న సంజయ్ స్వయంగా కొడుకుని దాచిపెట్టి మంత్రిని కదా అన్న అహంకారంతోనో కొడుకుపై ఉన్న వాళ్ళమాలిన ప్రేమతోను నాకేం అవుతుంది అనుకొని భగీరథను పోలీసులకు అప్పగించకపోవడం ఇప్పుడు కొంపముంచింది. కొడుకు ఎలాగో కేసులో కూరుకు పోయారు. బెయిల్ దొరుకుతుందని లాయర్లు చెప్పిన మాటలు వినడం వల్లే జాప్యం జరిగిందని అని సంజయ్ నిన్న ప్రకటన చేయడం ఆయనను మరింత క్లిష్ట పరిస్థితుల్లోకి నెట్టింది. నిందితులకు సహకరించారని అతనిపై కూడా కేసు నమోదు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆయన మాట దుల తోనే ఇదంతా జరిగిందని రాజకీయ వర్గాలు గుసగుసలాడుతుండగా ఆయన ఆత్మీయులు, మిత్రులు పాపం మంత్రి పదవి ఆనందం పుత్రునితో గోవిందం అని బాధపడుతున్నారు.

Bandi Sanjay : సెల్ఫ్ గోల్స్

బండి భగీరథ్ తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని మైనర్ బాలిక తన తల్లి తో కలిసి వచ్చి హైదరాబాదులోని పేట్ బషీర్ బాగ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. బాలికతోపాటు ఆమె తల్లి కొన్ని గంటలు వేచి ఉన్న అనంతరం పోలీసులు బండి భగీరథ్ పై పోక్సో చట్టం 11 కింద కేసు నమోదు చేశారు. ఇక్కడి వరకు బాగానే ఉంది. ఇక్కడి నుండే బండి సెల్ఫ్ గోల్స్ ప్రారంభయ్యాయి.

తప్పు చేసిన కొడుకును పోలీసులకు అప్పగించాల్సింది పోయి కరీంనగర్ రెండవ పోలీస్ స్టేషన్లో కొడుకు భగీరథ చేత బాధితురాలిపై హనీ ట్రాప్ కేసు పెట్టించారు
తొందరపాటు ఫిర్యాదులో బాలికతో తనకు పరిచయం ఉందని స్నేహితుడి ద్వారా పరిచయమైందని, ఫ్యామిలీ ఫంక్షన్లకు వెళ్లానని, గుళ్ళు గోపురాలకు తిరిగానని భగీరథ చెప్పడం కొంపముంచింది

ఆర్థికంగా ఉన్న బాధిత కుటుంబానికి 50,000 ఇచ్చానని కోట్ల రూపాయలు డిమాండ్ చేశారని ఫిర్యాదులో పేర్కొనడం భగీరథకు కష్టాలు తెచ్చిపెట్టింది కరీంనగర్ లో నమోదైన కేసుతో బాధితురాలి పక్షాన మహిళ సమాజం అండగా నిలిచింది. నిరసన కార్యక్రమాలు చేపట్టింది

పరిస్థితి చేయి దాటడంతో పోలీసులు కేసును పోక్సో 6 సెక్షన్ కు ఆల్టరు చేయడం భగీరథ మెడకు చుట్టుకుంది పోలీసులు మొదట చేసిన పోక్సో 11 ప్రకారం స్టేషన్ లో బెయిల్ వచ్చేది. సెక్షన్ ఆల్టర్ చేయడం వల్ల బెయిలు దొరకని పరిస్థితి వచ్చింది

రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసులో సిట్ వేసి విచారణ కోసం ప్రత్యేక అధికారుల్ని నియమించింది బాధితురాలు స్టేట్​ మెంట్ ఆధారంగా మొదట పెట్టిన కేసును పోక్సో సెక్షన్ 6 గా ఆల్టర్ చేశారుప కొడుకు పై నమోదైన కేసు పై స్పందించి కరీంనగర్ ఏక్తాయాత్రలో బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు మరింత దుమారాన్ని రేపాయి. తన కుటుంబం జోలికి వచ్చిన ఏ ఒక్కరిని వదిలిపెట్టనని నిప్పు రవ్వగా మారి వారిని దగ్దం చేస్తానని వ్యాఖ్యానించడం బండి కుటుంబానికి మరిన్ని కష్టాలు తెచ్చిపెట్టాయి

బండి భగీరథ ను అరెస్టు చేయడం లేదని రాష్ట్రవ్యాప్తంగా వెలువెత్తిన నిరసనలతో ప్రభుత్వం ఈ కేసులో తాము అనవసరంగా ఇరుక్కుంటున్నామని గుర్తించి కేసును తీవ్రంగా పరిగణించింది. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బండి సంజయ్ చట్టాన్ని గౌరవించి కొడుకును పోలీసులకు అప్పగించాలని చెప్పే స్థాయికి తెచ్చింది

ఢిల్లీ, హైదరాబాద్ తో పాటు కరీంనగర్ లోని బండి నివాసాల కు పోలీసులు వెళ్లి భగీరథ కోసం సోదాలు చేసే పరిస్థితిని తెచ్చిపెట్టాయి కోర్టులో మధ్యంతర బెయిలు వారం వాయిదా పడటం, అరెస్టు చేయకుండా ఉత్తర్వులు ఇవ్వలేమని చెప్పడం పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేయడం తో మరింత క్లిష్ట పరిస్థితులు వచ్చాయి రోజురోజుకు పెరుగుతున్న వ్యతిరేకతతో శనివారం సాయంత్రం బండి భగీరథను లాయర్ల సమక్షంలో పోలీసులకు అప్పగించారు రెండు గంటల పాటు పోలీసులు విచారించి వైద్య పరీక్షల అనంతరం న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచారు

రిమాండ్ రిపోర్టును పరిశీలించిన న్యాయమూర్తి బండి భగీరథకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు ఇవ్వడంతో శనివారం అర్ధరాత్రి భగీరథను చర్లపల్లి జైలుకు తరలించారు ఈనెల 8న కేసు నమోదు కాగానే కొడుకును పోలీసులకు అప్పగిస్తే స్టేషన్ బెయిల్ తో పోయేది. తప్పు మీద తప్పు చేయడంతో చర్లపల్లి జైలు వరకు తీసుకువెళ్లింది

Bandi Sanjay : కార్పొరేటర్ నుండి ..

తెలంగాణ బిజెపిలో అత్యంత తక్కువ సమయంలో ఎక్కువగా ఎదిగిన నాయకుడు బండి సంజయ్ కుమార్. కరీంనగర్ నగరపాలక సంస్థ కార్పొరేటర్ స్థాయి నుండి కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రిగా అతి తక్కువ కాలంలో ఎదిగారు. 2019లో మొదటిసారిగా పార్లమెంట్ సభ్యునిగా ఎన్నికైన బండి సంజయ్ 2024లో రెండవసారి పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నిక కావడంతో మోడీ ప్రభుత్వంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

Bandi Sanjay : ఐసీయూలో మినిస్టర్

బండి భగీరథ పై ఫోక్సో కేసు నమోదు కావడం కేంద్రమంత్రికి కష్టాలను తెచ్చిపెట్టింది. పుత్రోత్సాహం మంత్రి పదవిని ఐసీయూలోకి నెట్టింది. తెలంగాణ బిజెపిలో తిరిగే లేదు అనుకున్న బండి సంజయ్ ని డిఫెన్స్ లోకి నెట్టివేశాయి. ఒకానొక సమయంలో కేంద్ర మంత్రి పదవి నుండి భర్త రఫ్ చేస్తారని ప్రచారం కూడా జోరుగా సాగింది. కేసులో భగీరత్ కు రిమాండ్ విధించడం వల్ల మొదటి నుండి ఈ కేసులో తన కొడుకు తప్పుచేయలదని చెప్పిన సంజయ్ ను కష్టాల్లోకి నెట్టివేశాయి. మంత్రి పదవి ఉంటుందా ఊడుతుందా అని కొత్త చర్చకు దారి తీసాయి.

Bandi Sanjay : తండ్రికి మరో కష్టం

పోక్సో చట్టం ప్రకారం నేరం చేసినా, చేసినవారికి సహకరించినా అదే కేసులో నిందితుడిగా నమోదయ్యే అవకాశాలున్నాయి. కేసు నమోదు పై ఏకాయాత్రలో చేసిన వ్యాఖ్యలు శనివారం రాత్రి బండి భగీరథ పోలీసులకు లొంగిపోయిన సమయంలో బండి సంజయ్ విడుదల చేసిన ప్రకటన ప్రస్తుతం ఆయనకు కొత్త కష్టాలను తెచ్చిపెట్టింది. నిందితునికి సహకరించారని బండి పై కూడా కేసు నమోదు అయ్యే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

Bandi Sanjay : 2012లో పోక్సో చట్టం

ఢిల్లీ నిర్భయ కేసు అనంతరం దేశవ్యాప్తంగా జరిగిన నిరసనల నేపథ్యంలో అప్పటి యూపీఎ సర్కార్ పోక్సో చట్టాన్ని తీసుకొచ్చింది. పోక్సో చట్టం అనేది 18 సంవత్సరాల లోపు వయస్సు గల బాలబాలికలను లైంగిక వేధింపులు, లైంగిక దాడులు మరియు అశ్లీలత నుండి రక్షించడానికి భారతదేశంలో రూపొందించబడిన ఒక సమగ్రమైన చట్టం. దీని లైంగిక నేరాల నుంచి చిన్నారుల రక్షణ చట్టం అని పిలుస్తారు. ఈ చట్టం గురించిన ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి. ఈ చట్టాన్ని 2012లో రూపొందించారు. ఇది 2012 నవంబర్ 14 నుండి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. ఈ చట్టం లో లింగ భేదం లేదు. అంటే బాలికలకు, బాలురకు ఇద్దరికీ సమానంగా వర్తిస్తుంది. 18 సంవత్సరాల లోపు ప్రతి ఒక్కరినీ ఈ చట్టం కింద ‘పిల్లలు’గా పరిగణిస్తారు.
లైంగిక వేధింపులు, అసభ్యకరమైన తాకిడి, బలవంతపు చర్యలు, మరియు అశ్లీల చిత్రాల ప్రదర్శన వంటి అన్నింటినీ ఇందులో నేరాలుగా పరిగణిస్తారు. నేరం యొక్క తీవ్రతను బట్టి కనీసం 3 సంవత్సరాల నుండి జీవిత ఖైదు వరకు శిక్షలు పడే అవకాశం ఉంది. పోక్సో చట్టం నవంబర్ 14, 2012న యూపీఏ హయాంలో అమలులోకి వచ్చింది. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం హయాం లో ఆగష్టు 6, 2019 సవరణ చట్టం వచ్చింది. చట్ట సవరణ తో పోక్సో చట్టం మరింత కఠినతమైంది. ఈ చట్టం లో నేరం చేసిన వారితో పాటు సహకరించిన వారిపై కూడా కేసు నమోదు అవుతుంది.

ALSO READ : బండి భగీరత్ కు 14 రోజుల రిమాండ్

Leave a Reply