పంట దెబ్బతిన్న రైతులను ఆదుకోవాలి

పంట దెబ్బతిన్న రైతులను ఆదుకోవాలి

దెబ్బతిన్న పంటలను పరిశీలిస్తున్న…
మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వర రెడ్డి

ఉరవకొండ రూరల్, ఆంధ్రప్రభ : ఉరవకొండ నియోజకవర్గంలోని అంకంపల్లి, దుద్దేకుంట, గంగవరం గ్రామాలలో అకాల వర్షాలకు, ఈదురు గాలులకు మొక్కజొన్న, అరటి పంటలు పూర్తిగా దెబ్బతిని రైతులు తీవ్ర నష్టపోయారు. దీనితో ఉరవకొండ వైఎస్ఆర్ సీపీ సమన్వయకర్త వై, విశ్వేశ్వర రెడ్డి, వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు కలిసి శనివారం అంకంపల్లి, దుద్దేకుంట, గంగవరం గ్రామాలలో పర్యటించి దెబ్బతిన్న అరటి, మొక్కజొన్న పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పంట నష్టపోయిన రైతులను పరామర్శించారు. ఎంత నష్టం వాటిల్లింది.

అన్న విషయాన్ని ఆయా గ్రామాల రైతులతో కలిసి వివరంగా తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వర రెడ్డి మాట్లాడుతూ గత వైయస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో, పంట నష్టపోతే దాదాపు 7, 500 కోట్లు ఇన్సూరెన్స్ రైతులకు కేటాయించిన ఘనత వై ఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. పంటలు దెబ్బతిని లక్షలాది రూపాయలు రైతులు నష్టపోయారన్నారు.

రైతులు ఇంత నష్టపోయిన కూటమి ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదని విమర్శించారు. కూటమి ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్న, బెలుగుప్ప మండలంతో పాటు ఉరవకొండ నియోజకవర్గంలో ఎంత అయితే నష్టం వాటిలిందో, ప్రభుత్వం సర్వే చేసి, ప్రతి ఒక్క రైతుకు న్యాయం చేసి , తగిన నష్టపరిహారాన్ని చెల్లించాలని డిమాండ్ చేశారు.

Leave a Reply