మాజీ సి ఎం జగన్ ను విమర్శించే స్థాయి మీది కాదు నానాజీ..

జగన్ ఆదేశిస్తే మా అడుగుల చప్పుడుకు నీ.. గుండె ఆగిపోతుంది..
ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్సీ ఇసాక్ బాష…
నంద్యాల ప్రతినిధి, ఆంధ్రప్రభ :
స్థానిక సంస్థలు ఎన్నికలు రాకముందే జిల్లాలోని రాష్ట్రంలోనూ రాజకీయ వేడి మొదలైంది. రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం మొదలైంది.వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ చేసిన అనుచిత వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై నంద్యాల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నిరసన వ్యక్తం చేస్తున్నాయి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.పంతం నానాజీకి నంద్యాల ఎమ్మెల్సీ ఇసాక్ బాష స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

“జగనన్న ఆదేశం ఇస్తే… మా అడుగుల చప్పుడుకే నీ గుండె ఆగిపోతుంది.. ఖబడ్డార్!” అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయాల్లో విమర్శలు సహజం… కానీ విజ్ఞత మరచి, కోట్లాది మంది అభిమానించే ఒక ప్రజా నాయకుడిపై నోరుపారేసుకుంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. జగన్. ను ఒక్క మాట అన్నా.. సహించే ప్రసక్తే లేదన్నారు.పంతం నానాజీపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ నంద్యాల రెండవ పట్టణ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న రు.అక్కడ ఎస్ఐ కృష్ణారెడ్డికి నానాజీ అనుచిత వ్యాఖ్యలపై అధికారికంగా ఫిర్యాదుజేశారు. చట్టం ముందు ఎవరైనా ఒకటేనని, జగనన్నపై విషం చిమ్మితే ఊరుకునేది లేదన్నారు. సిఐ కి వినతి పత్రం ఇచ్చిన వారిలో రాష్ట్ర రైతు విభాగం సెక్రటరీ రత్నబాబు చౌదరి, రాష్ట్ర మహిళా విభాగం జనరల్ సెక్రెటరీ శశికళ రెడ్డి, రవికుమార్ ఆంజనేయులు, శంకర్ నాయక్, వైసిపి జిల్లా లీగల్ సెల్ అధ్యక్షుడు రామ సుబ్బయ్య, జిల్లా వైసీపీ ఉపాధ్యక్షుడు దాల్మిల్ అమీర్,గంగిశెట్టి శ్రీధర్, వైసీపీ జిల్లా మేధావుల సంఘం అధ్యక్షుడు రసూల్ ఆజాద్, వైసిపి జిల్లా అధికార ప్రతినిధి అనిల్ అమృతరాజ్, శివ,దేవనగర్ భాష, టీవి రమణ,ప్రతాపరెడ్డి, రామచంద్రుడు, సాయిరాం రెడ్డి, మాజీ కౌన్సిలర్ లు చింత శ్రీనివాసులు, మేస చంద్ర శేఖర్, సుబ్బరాయుడు పాల్గొన్నారు.