ఎన్‌సీసీతో ధైర్యసాహసాలు, క్రమశిక్షణ పెంపొందుతాయి

ఎన్‌సీసీతో ధైర్యసాహసాలు, క్రమశిక్షణ పెంపొందుతాయి

  • 8వ ఆంధ్ర ఎయిర్ స్క్వాడ్రన్ ఎన్‌సీసీ గ్రూప్ కెప్టెన్ కె వి శ్రీనివాస్

ఆంధ్రప్రభ, విజయవాడ: ఎన్‌సీసీ శిక్షణ విద్యార్థులకు అమూల్యమైన వరమని, దీనివల్ల క్రమశిక్షణతో పాటు ధైర్యసాహసాలు అలవడతాయని 8వ ఆంధ్ర ఎయిర్ స్క్వాడ్రన్ ఎన్‌సీసీ కమాండింగ్ ఆఫీసర్, గ్రూప్ కెప్టెన్ కె.వి శ్రీనివాస్ తెలిపారు. ఉయ్యూరులోని విశ్వశాంతి హైస్కూల్‌లో గత ఆరు రోజులుగా నిర్వహిస్తున్న వార్షిక శిక్షణ శిబిరంలో బుధవారం ఆయన మాట్లాడారు.

ఈ సందర్భంగా ఎన్‌డిఆర్ఎఫ్ బృందాలు విద్యార్థులకు అత్యవసర పరిస్థితుల్లో ప్రాణరక్షణ విధానాలు, వరదలు, భూకంపాల సమయంలో చేపట్టాల్సిన సహాయక చర్యలు, ప్రథమ చికిత్స వంటి అంశాలపై ప్రాయోగిక అవగాహన కల్పించాయి. ఈ కార్యక్రమంలో ఎన్‌డిఆర్ఎఫ్ ఇన్‌స్పెక్టర్ ఎన్. గోపాలకృష్ణ, హెడ్ కానిస్టేబుల్ రసూల్ సాహెబ్, కానిస్టేబుల్ అనిల్ కుమార్ పాల్గొని శిక్షణ ఇచ్చారు.

అదేవిధంగా ఆరోగ్యం, పరిశుభ్రతపై డాక్టర్ గోపీచంద్, సైబర్ భద్రతపై సీఐ టీవీవీ రామారావు విద్యార్థులకు మార్గదర్శనం చేశారు. ప్రతిరోజూ నిర్వహిస్తున్న విభిన్న శిక్షణా కార్యక్రమాల ద్వారా విద్యార్థుల్లో మనో వికాసం పెరుగుతోందని కె.వి శ్రీనివాస్ పేర్కొన్నారు. 8 నావల్ కమాండింగ్ ఆఫీసర్, కమాండర్ సుజిత్ కుమార్ కెరియర్ గైడ్లైన్స్ గురించి క్యాడెట్లకు వివరించారు.

ఈ కార్యక్రమంలో ఏవో ఫ్లైట్ లెప్టనెంట్ సూరజ్ సింగ్, ఫ్లైట్ లెఫ్టినెంట్ జాన్సన్, జూనియర్ వారెంట్ ఆఫీసర్లు కేఆర్ సూరజ్, రోషన్ ప్రభాత్, జీసీఐ హారిక, పిఐ స్టాఫ్ సిపిఎల్ అక్కోజం చౌభా సింగ్, సార్జెంట్లు బీస్ట్, కే. గోవిందరావు, కుశ్వాహా, సిపిఎల్ అభిషేక్, రాంబాబు, అలాగే యన్‌సిసి అధికారులు బి. బ్రహ్మేశ్వరరావు, పి. భాస్కరరావు, ఫజులుల్లా తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply