మత సామరస్యానికి ప్రతీకగా మొహరం ఉత్సవాలు ముగింపు

జైనూర్, ఆంధ్రప్రభ : మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే మొహరం పండగ ఉత్సవాలు శనివారం ముగిశాయి. మహిళలు, పురుషులు వయోభేదం లేకుండా గత కొద్ది రోజులుగా డప్పుల చప్పుడు..గజ్జెల సవ్వడితో సందడి చేసిన గిరిపల్లెలు మొహరం ఉత్సవాలకు శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించి సహపంక్తి బోజనాలతో ముగింపు పలికారు. కాగా చివరి రోజు జైనూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కుడ్మెత విశ్వనాథ్ రావు మండలం లోని రావుజీ గూడ సవారీ, పీరీల బంగ్లాను సందర్శించి పూజలు నిర్వహించి మొక్కుకున్నారు.

అంతకు ముందు పీరిల బంగ్లా ముందు భక్తుల సౌకర్యార్థం షెడ్డు నిర్మాణం చేపట్టాలని గ్రామ పెద్దలు చైర్మన్ గారికి వినతి పత్రం అందజేశారు. కనీస మౌలిక వసతులు లేక మొహరం పండుగ సందర్భంగా భక్తులు ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి షేడ్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని విన్నవించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ అబ్దుల్ ముఖీద్, సర్పంచులు ఆత్రం మీరా జాలీంషా, మెస్రం స్పందన భూపతి, మడావి లక్ష్మణ్, సేద్మాకి జానేరావు, నాయకులు గ్రామస్తులు పాల్గొన్నారు.