Awareness | రోడ్డు భద్రత నియమాలపై అవగాహన..

Awareness | రోడ్డు భద్రత నియమాలపై అవగాహన..
- మక్తల్ సీఐ రామ్ లాల్
Awareness | మక్తల్, ఆంధ్రప్రభ : నారాయణపేట జిల్లా మక్తల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అర్రివ్ అలీవ్ కార్యక్రమంలో భాగంగా జక్లేర్ గ్రామంలోని ప్రధాన చౌరస్తాలో రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా విస్తృత అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. గత కొన్ని రోజుల క్రితం రోడ్డు ప్రమాదానికి గురైన జక్లేర్ గ్రామానికి చెందిన హుస్సేన్ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని, వాహనదారులు, ఆటో డ్రైవర్లు, స్థానిక ప్రజలకు రోడ్డు భద్రత నియమాలపై అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమం మక్తల్ సీఐ రామ్ లాల్, ఎస్సై వై.భాగ్యలక్ష్మి రెడ్డిల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణాలు అతివేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం, హెల్మెట్, సీట్‌బెల్ట్ ధరించకపోవడం, ట్రాఫిక్ నియమాలను నిర్లక్ష్యం చేయడమేనని అన్నారు. ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్, సీట్‌బెల్ట్ వినియోగించాలని, ట్రాఫిక్ సంకేతాలను గౌరవించాలని, నిర్ధేశిత వేగ పరిమితిని పాటించాలని సూచించారు.
ఆటో డ్రైవర్లు ప్రయాణికుల భద్రతను పరిగణలోకి తీసుకొని వాహనాలు నడపాలని అన్నారు. మైనర్ పిల్లలు వాహనాలు నడపకుండా తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలని కోరారు. రోడ్డు భద్రత అనేది ఒకరి బాధ్యత కాదనీ, ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా గుర్తించి నియమాలు పాటించినప్పుడే ప్రమాదాలను తగ్గించవచ్చని తెలిపారు. అర్రివ్ అలీవ్ కార్యక్రమం ఉద్దేశ్యం ప్రజలు సురక్షితంగా తమ గమ్యస్థానానికి చేరుకోవడమేనని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, గ్రామ పెద్దలు, వాహనదారులు, ఆటో డ్రైవర్లు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
