TDP MP | బీఆర్ఎస్, వైసీపీల అజెండా ఒక్కటే…

TDP MP | బీఆర్ఎస్, వైసీపీల అజెండా ఒక్కటే…

  • టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పల నాయుడు

TDP MP | అంధ్రప్రభ, వెబ్ డెస్క్ : వైసీపీ, బీఆర్ఎస్ పార్టీలు రెండు ఒక్కటేనని.. ఆ పార్టీల అజెండా కూడా ఒక్కటేనని టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పల నాయుడు విమర్శించారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… బీఆర్ఎస్, వైసీపీ నేతలు కుమ్మక్కై సీఎం చంద్రబాబు నాయుడుపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యంగా గోదావరి జలాల విషయంలో ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ బురద రాజకీయం చేస్తున్నారని ధ్వజమెత్తారు.

జగన్ కోర్టుకు హాజరైనప్పుడు బీఆర్ఎస్ నాయకులు ఫ్లెక్సీలతో స్వాగతం పలకడం, అలాగే కేటీఆర్ ఖమ్మం వచ్చినప్పుడు వైసీపీ నేతలు ఏపీలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం వారి మధ్య ఉన్న రహస్య స్నేహానికి నిదర్శనమని ఎద్దేవా చేశారు. మీ స్నేహం ఎవరికీ అభ్యంతరం కాదని, కానీ రాజకీయ లబ్ధి కోసం ప్రజలను మోసం చేయడం సరైంది కాదని హితవు పలికారు. జగన్ మోహన్ రెడ్డి బెంగళూరులో కూర్చొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై కుట్రలు పన్నుతున్నారని విమర్శించారు.

Leave a Reply