Cabinet Meeting – రేవంత్ అధ్యక్షతన నేడు క్యాబినెట్ భేటి

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు జరగనుంది.

ఈ కేబినెట్ సమావేశంలోప్రధానంగా ఎస్సీ వర్గీకరణపై కమిషన్ నివేదికకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణకు ఆమోదం తెలపడానికి అవసరమైన బిల్లులను ఆమోదించనున్నారు. బీసీ గణనకు మరోసారి ఛాన్స్ ఇచ్చిన నేపథ్యంలో నమోదు చేసుకున్న వారి వివరాలతో తుది గణననకు మంత్రి వర్గం ఆమోదం తెలపనుంది.

బీసీలకు విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు పెంచే బిల్లుకు, రాజకీయంగా రిజర్వేషన్లు కల్పించే బిల్లులకు సైతం కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. వీటితో పాటుగా బడ్జెట్ సమావేశాల తేదీలను కూడా మంత్రి మండలి అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.

అయితే, బడ్జెట్ సమావేశాలు ఏ రోజున ప్రారంభమయ్యేది.. బడ్జెట్ ప్రవేశ పెట్టే తేదీలతో పాటు తదితర అంశాలను తెలంగాణ కేబినెట్ సమావేశంలో ఖరారు చేయనున్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభం రోజున ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించే గవర్నర్ ప్రసంగానికి సైతం మంత్రి మండలి ఆమోద ముద్ర వేయనుంది.

దీంతో పాటుగా నూతన టూరిజం పాలసీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. వివిధ శాఖలకు సంబంధించిన కొత్త పోస్టులు సృష్టించడం.. వాటిని ఆమోదించడం చేయనున్నారు. వీటితో పాటు మరికొన్ని కీలక అంశాలకు రేవంత్ రెడ్డి కేబినెట్ ఆమోద ముద్ర వేయనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *