Ravindra Jadeja | ర‌వీంద్ర జ‌డేజాను సాగ‌నంపండి?

Ravindra Jadeja | ర‌వీంద్ర జ‌డేజాను సాగ‌నంపండి?

  • పూర్ ఫామ్‌లో ఆల్‌రౌండ‌ర్
  • వ‌రుస‌గా విఫ‌ల‌మ‌వుతుండ‌టంతో అభిమానుల ఆగ్ర‌హం
  • ప్రమాదంలో క్రికెట‌ర్ జ‌డేజా వన్డే కెరీర్
  • బ్యాటింగ్‌, బౌలింగ్‌లో ఫెయిల్‌

Ravindra Jadeja | వెబ్‌డెస్క్‌, ఆంధ్ర‌ప్ర‌భ : టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా ఇటీవ‌ల వన్డేల్లో వ‌రుస‌గా విఫ‌ల‌మ‌వుతున్నాడు. భారత క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ ఆల్ రౌండర్లలో ఒకడిగా పేరుగాంచిన జడేజా కెరీర్ ఇప్పుడు సందిగ్ధంలో పడింది. స్పిన్ ఆల్‌రౌండర్‌గా జట్టులో కొనసాగుతున్న జడేజా బ్యాటింగ్, బౌలింగ్ రెండిట్లోనూ విఫలమవుతున్నాడు.

Ravindra Jadeja

ఒకప్పుడు జడేజా బ్యాటింగ్, బౌలింగ్‌లో రాణిస్తూ టీమిండియాకు విజ‌యాలు అందించేవాడు. కానీ ప్ర‌స్తుతం అత‌ని ఫామ్ చాలా పూర్‌గా ఉంది. ఇటు ప‌రుగులు చేయ‌లేక‌పోతున్నాడు.. అటు వికెట్లు తీయ‌లేక‌పోతున్నాడు. వన్డే ఫార్మాట్ లో స్వదేశంలో జడేజా హాఫ్ సెంచరీ చేయక 13 ఏళ్లు అవుతుంది. 2023 ప్రపంచ కప్ తర్వాత 13 మ్యాచ్‌ల్లో 29.8 సగటుతో కేవలం 149 పరుగులు మాత్రమే చేయగలిగాడు. బౌలింగ్ లో 12 వికెట్లు మాత్రమే పడగొట్టాడు.

Ravindra Jadeja | ఒక్క వికెట్ కూడా తీయ‌లే..

Ravindra Jadeja

తాజాగా న్యూజిలాండ్ తో జరిగిన వన్డే సిరీస్ లోనూ జడేజా ఘోరంగా విఫలమయ్యాడు. సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో రవీంద్ర జడేజా ప్రదర్శన ఆశాజనకంగా లేదు. ఒకప్పుడు ప్రత్యర్థి బ్యాటర్లను తన స్పిన్ మాయాజాలంతో వణికించిన జడేజా, ఈ సిరీస్‌లో ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు.

కేవలం బౌలింగ్‌లోనే కాకుండా, బ్యాటింగ్‌లోనూ కీలక సమయాల్లో విఫలమై జట్టును ఆదుకోవడంలో తడబడ్డాడు. ఇండోర్ వన్డేలో విరాట్ కోహ్లీతో కలిసి జట్టును గెలిపించే అవకాశం ఉన్నప్పటికీ, కేవలం 12 పరుగులకే అవుట్ అయి నిరాశపరిచాడు. ఇక బౌలింగ్ విషయానికి వస్తే.. మూడు మ్యాచుల్లో కలిపి దాదాపు 25 ఓవర్లు వేసిన జడేజా, 140కి పైగా పరుగులు సమర్పించుకున్నాడు. కానీ వికెట్ల ఖాతా మాత్రం సున్నా.

Ravindra Jadeja | అక్షర్ పటేల్ రెడీ..?

Ravindra Jadeja

జడేజా ఫామ్ కోల్పోవడంతో టీమ్ మేనేజ్‌మెంట్ ఇప్పుడు అక్షర్ పటేల్ వైపు చూస్తోంది. ఇత‌ను గత కొంతకాలంగా అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. బ్యాటింగ్‌లో జడేజా కంటే వేగంగా పరుగులు రాబట్టడం, బౌలింగ్‌లో వైవిధ్యం చూపిస్తాడు. 2027 వన్డే వరల్డ్ కప్ లక్ష్యంగా యువ ఆటగాళ్లను ప్రోత్సహించాలని భావిస్తున్న కోచ్ గంభీర్, ఇకపై జడేజాకు బదులు అక్షర్‌కే ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది.

CLICK HERE TO READ సిరీస్ ప‌ట్టేనా.. వ‌దిలేసేనా?

CLICK HERE TO READ MORE

Leave a Reply