శోభా రాణికి టోపేయి జాతీయ పురస్కారం
శోభా రాణికి టోపేయి జాతీయ పురస్కారం
కొత్తచెరువు, ఆంధ్రప్రభ : శ్రీ సత్య సాయి జిల్లా టేకులోడు ప్రిన్సిపాల్ శోభారాణికి టోపే ఈ (TOFEI) జాతీయ పురస్కారం లభించినట్టు జిల్లా విద్యాశాఖ అధికారి కృష్ణప్ప తెలిపారు. టొబాకో 3 ఎడ్యుకేషనల్ ఇనిస్టి ట్యూషన్స్(TOFEI) స్కూల్ ఛాలెంజ్ పొగాకు రహిత దిశగా లో భాగంగా 2026 కు గాను టేకులోడు ప్రిన్సిపాల్కు జాతీయ పురస్కారం లభించింది.
మే 29వ తేదీన న్యూఢిల్లీలోని డాక్టర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్లో జరగనున్న జాతీయ స్థాయి సన్మాన కార్యక్రమానికి సంబంధించి భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ , పాఠశాల విద్యా మరియు అక్షరాస్యత విభాగం, పాలసీ అనాలసిస్ కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ ( PACE) సెక్షన్ నుండి సమాచారం జిల్లా విద్యాశాఖకు అందింది. ఆంధ్రప్రదేశ్లో ఈ జాతీయ స్థాయి పురస్కారాలకు నాలుగు పాఠశాలలో ఎంపిక కాబడ్డాయి వాటిలో ఏపీ ఆర్ ఎస్ టేకులోడు పాఠశాల ఉండడం విశేషం. శ్రీ సత్య సాయి జిల్లాలో గల ఏపీ ఆర్ ఎస్ టేకులోడు పాఠశాల జాతీయస్థాయి పురస్కారానికి ఎంపిక కావడం పట్ల జిల్లా విద్యాశాఖ అధికారులు ఆనందం వ్యక్తపరిచారు.
ఈనెల 29వ తేదీన జరిగే కార్యక్రమానికి హాజరుకావాలని టేకులోడు పాఠశాల ప్రిన్సిపాల్ శోభారాణిని కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించింది. ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారి కృష్ణప్ప, సమగ్ర శిక్ష ఏ ఎం ఓ చంద్రశేఖర్ మరియు మండల విద్యాశాఖ అధికారులు టేకులోడు పాఠశాల ప్రిన్సిపాల్ శోభారాణిని అభినందించారు.
