గాంధీ గుడి పూజారికి జ్యోతిష ఆచార్య అవార్డు
చిట్యాల, ఆంధ్రప్రభ.. చిట్యాల మండలం పెద్దకాపర్తి పరిధిలో జాతీయ రహదారిపై గల గాంధీ గుడి పూజారి, జ్యోతిష పరిశోధకులు కూరెళ్ళ నరసింహాచారికి జ్యోతిష ఆచార్య అవార్డును ప్రదానం చేశారు. ఏపీ, చీరాలకు చెందిన ఈశ్వర నారాయణ ఆస్ట్రో రీసర్చ్ అకాడమీ వారు తృతీయ వార్షికోత్సవం సందర్భంగా ఆదివారం జరిగిన కార్యక్రమంలో ఆదివారం ఈ అవార్డును అందజేశారు.
జ్యోతిష శాస్త్రంలో ఆయన నిరంతరం పరిశోధనలు చేస్తూ, దాని ప్రాధాన్యతను చాటిచెబుతున్నందుకు గాను అకాడమీ నిర్వాహకులు ఈ సత్కారాన్ని అందించారు.
