50 monkeys | మొదటి హామీ అమలు..

50 monkeys | మొదటి హామీ అమలు..

  • కోతుల బెడదను తగ్గించడమే మొదటి వాగ్దానం
  • అమలు చేసిన సర్పంచ్ కాటం వెంకటేశం
  • కోతులను బోన్ లో బంధించారు

50 monkeys | చిట్యాల, ఆంధ్రప్రభ : నల్లగొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తిలో ప్రజలను తీవ్రంగా ఇబ్బందులకు గురిచేస్తున్న కోతుల బెడదను నివారించేందుకు కొత్త సంవత్సరంలో జనవరి1 గురువారం ఆంధ్రకు చెందిన కోతులు పట్టే నిపుణుల(Professionals)ను తీసుకొచ్చి కోతులు పట్టే కార్యక్రమాన్ని సర్పంచ్ కాటం వెంకటేశం చేపట్టారు.

మండలంలోని పెద్ద కాపర్తి గ్రామంలో కోతులు విపరీతంగా పెరిగిపోయి పంటలు, ఇల్లు ఆస్తులను ధ్వంసం చేయడంతో పంచాయతీ పాలకవర్గం పెద్దలతో కలిసి సమావేశం ఏర్పాటు చేసి ఎన్నికల్లో తనను సర్పంచుగా గెలిపిస్తే మొదటి వాగ్దానం కోతులు లేకుండా చేస్తానని నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం సమక్షంలో హామీ(guaranteed) ఇవ్వడం జరిగిందని పేర్కొన్నారు. కొత్త సంవత్సరంలో గ్రామ ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు గ్రామ పెద్దల సహకారంతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగిందన్నారు.

గ్రామంలో ఇప్పటివరకు 50కి పైగా కోతుల(50 monkeys)ను పట్టడం జరిగిందని, గ్రామంలో కోతుల సమస్య లేకుండా చూడడమే తన లక్ష్యమని సర్పంచ్ తెలిపారు. గ్రామ పంటలు సురక్షితమవుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. గ్రామస్తులు ఈ చర్యను ఆహ్వానించారు. కోతుల బెడద వల్ల వ్యవసాయ పంటలతో పాటు చిన్నపిల్లలు, వృద్ధులకు కూడా భయాందోళన నెలకొన్నదని తెలిపారు. కోతుల నివారణ చర్యలు చేపట్టిన సర్పంచ్ కాటం వెంకటేశంను గ్రామ ప్రజలు, అధికారులు, ప్రజా ప్రతినిధులు అభినందించారు.