అంగన్వాడీ కేంద్రాల్లో పోషణ పక్వాడ కార్యక్రమం..

అంగన్వాడీ కేంద్రాల్లో పోషణ పక్వాడ కార్యక్రమం..

హుజూర్ నగర్, ఆంధ్రప్రభ : హుజూర్ నగర్ మండల పరిధిలోని అంగన్వాడీ కేంద్రం – 1, 2, 3 సెంటర్ లలో పోషణ పక్వాడ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా అంగన్వాడీ సూపర్వైజర్ రమాదేవి మాట్లాడుతూ… పౌష్టికాహార ప్రతిజ్ఞ, పౌష్టికాహార ప్రాముఖ్యతను తెలియజేస్తూ చిన్నారులను విధిగా అంగన్వాడి కేంద్రాలకు పంపించాలని తల్లులకు సూచనలు ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్స్ విజయలక్ష్మీ అరుణమ్మ, ఎఎన్ఎమ్ విజయ, ఆశ కార్యకర్త సైధమ్మ పద్మ, గర్భిణీ బాలింతలు, చిన్నారులు పాల్గొన్నారు. మాధవరాయిని గూడెంలో… అంగన్వాడీ కేందం 1, 2 లో నిర్వహించిన గ్రాడ్యుయేషన్ డే లో సూపర్వైజర్ సోమమ్మ, అంగన్వాడీ టీచర్స్ ఇంద్రసేనారాణి, సుధారాణి, ఆయాలు సీత, పద్మ, మహిళా అధ్యక్షురాలు సావిత్రి, గర్భిణీలు, బాలింతలు, విద్యార్ధులు పాల్గొన్నారు.

Leave a Reply