చేనేత సహకార సంఘం అధ్యక్షుడు వంగరి రాములకు సన్మానం

నూతన బాధ్యతలను సమర్థంగా నిర్వహించాలని ఆకాంక్షించిన కాంగ్రెస్ నాయకులు

మోత్కూర్, ఆంధ్రప్రభ : మోత్కూర్ చేనేత సహకార సంఘం అధ్యక్షుడిగా ఎన్నికైన వంగరి రాములను జిల్లా కాంగ్రెస్ మాజీ ఉపాధ్యక్షుడు ఫైళ్ల సోమిరెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం శాలువాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, మోత్కూర్ చేనేత సహకార సంఘం మరింత అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. చేనేత కార్మికుల సంక్షేమం, సంఘం బలోపేతం కోసం నూతన అధ్యక్షుడు సమర్థవంతంగా పనిచేయాలని కోరుతూ అభినందనలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మోత్కూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ వెంకన్న, కౌన్సిలర్ కారుపోతుల వెంకన్న గౌడ్, ముషిపట్ల మాజీ సర్పంచ్ తండ సత్తయ్య గౌడ్, మార్కెట్ డైరెక్టర్ సమీరుద్దీన్, కాంగ్రెస్ మోత్కూర్ మండల ప్రధాన కార్యదర్శి భూషిపాక రమేష్, కాంగ్రెస్ నాయకులు లెంకల వేణు, యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు అవిశెట్టి కిరణ్‌కుమార్, మహమ్మద్ షాకిరుద్దీన్, దుర్గయ్య, మాజీ ఎంపీటీసీ బుగ్గ రాములు, నీలకంటి శ్రీనివాస్, రాహుల్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.