99 రోజుల ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా..

99 రోజుల ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా..

వికారాబాద్, ఆంధ్రప్రభ : 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా వికారాబాద్ మండలం కామారెడ్డిగూడలో రోడ్డు పనులు ప్రారంభించినట్లు గ్రామ సర్పంచ్ శివరాజ్ గౌడ్ తెలిపారు. గ్రామంలోని అన్ని వార్లలో రోడ్లు వేయించడం జరుగుతుందని.. వీటిని గురించి అధికారులకు నివేదించడం జరిగిందని పేర్కొన్నారు. వికారాబాద్ మండలంలో గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడం కోసం కృషి చేస్తున్నట్టు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply