రేవంత్ రెడ్డిని విమర్శించే హక్కు కేటీఆర్ కు లేదు
రేవంత్ రెడ్డిని విమర్శించే హక్కు కేటీఆర్ కు లేదు
గాండ్ల పల్లవి శివానంద్
వికారాబాద్, ఆంధ్రప్రభ : టిఆర్ఎస్ పాలించిన పది సంవత్సరాల్లో ఏ ఒక్క ఇల్లు ఇవ్వలేని ప్రభుత్వం నేడు ప్రజా పాలనలో ప్రతి గ్రామానికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక అర్హత మాజీ మంత్రి కేటీఆర్ కు లేదని వికారాబాద్ పట్టణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు గాండ్ల పల్లవి శివనంద్ పేర్కొన్నారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ వికారాబాద్ జిల్లా పర్యటన సందర్భంగా కేటీఆర్ అవాకులు చావాకులు పేర్కొంటున్నారని ప్రజలు నమ్మే స్థితిలో లేరని అన్నారు గత రెండున్నర సంవత్సరాలలో ప్రతి గ్రామంలో దాదాపు 50 ఏళ్ల వరకు ఇందిరమ్మ ఇల్లు వచ్చాయని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో పాటు ఇచ్చిన ఆరోగ్యను అమలు చేస్తున్నాయని తెలిపారు 10 సంవత్సరాల పాటు పాలించిన టిఆర్ఎస్ పార్టీ కేవలం ఫామ్ హౌస్ కి పరిమితమైందని ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాపాలన పేరుతో ప్రజల ముంగిట ప్రభుత్వాన్ని ఉంచారని తెలిపారు రాబోయే రోజుల్లో మరిన్ని సంక్షేమ పథకాలు చేపట్టి ప్రజల ఆశలమేరకు ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు స్పీకర్ ప్రసాద్ కుమార్ నేతృత్వంలో వికారాబాద్ నియోజకవర్గంలో ముందుకు సాగుతుందని అన్నారు.
