సెన్సార్ బోర్డు సభ్యుడుగా మెరుగు మధు

సెన్సార్ బోర్డు సభ్యుడుగా మెరుగు మధు

భువనగిరి /ఆంధ్రప్రభ : కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పని చేసే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్‌సీ) హైదరాబాద్ ప్రాంతీయ కార్యాలయానికి అడ్వైజరీ ప్యానెల్ సభ్యులుగా భువనగిరికి చెందిన మెరుగు మధును నియమిస్తూ సీబీఎఫ్‌సీ హైదరాబాద్ ప్రాంతీయ అధికారి డా. రాహుల్ గోవిల్కర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ నం. ఎం-11019/1/2025- డిఓ(ఎఫ్ సి) ద్వారా ఈ నియామకం జరిగినట్లు లేఖలో పేర్కొన్నారు.

ఈ నియామకం మూడు సంవత్సరాల పాటు లేదా తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు అమల్లో ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా అడ్వైజరీ ప్యానెల్ సభ్యులకు సంబంధించిన మార్గదర్శకాలు, సూచనలు, బయోడేటా ఫారమ్ తదితర వివరాలు కూడా అందజేశారు. ఈ నియామకం సినీ రంగానికి సంబంధించి ముఖ్య బాధ్యతగా భావిస్తూ ఆయనకు పలువురు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా మెరుగు మధు మాట్లాడుతూ.. తన నియమాకానికి సహకరించిన నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply