గరీబ్‌నగర్‌లో పోలీసుల స్పెషల్ డ్రైవ్..

గరీబ్‌నగర్‌లో పోలీసుల స్పెషల్ డ్రైవ్..

వికారాబాద్, ఆంధ్రప్రభ : జిల్లా ఎస్పీ స్నేహ మెహర ఆదేశాల మేరకు వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని 30వ వార్డు గరీబ్‌నగర్‌లో ఆదివారం ఉదయం కార్డన్ అండ్ సెర్చ్ కార్యక్రమం నిర్వహించినట్లు వికారాబాద్ డీఎస్పీ అంజయ్య తెలిపారు.

ఈ కార్యక్రమంలో టౌన్ సీఐ నాగరాజుతో పాటు మరో ముగ్గురు సీఐలు, 15 మంది ఎస్‌ఐలు, సుమారు 100 మంది కానిస్టేబుళ్లు పాల్గొన్నట్లు వెల్లడించారు. శాంతిభద్రతల పర్యవేక్షణలో భాగంగా ఈ తనిఖీలు చేపట్టినట్లు చెప్పారు.

నంబర్ ప్లేట్లు సరిగా లేని వాహనాలు, పత్రాలు లేని వాహనాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే బెల్ట్ షాపులు, గంజాయి అమ్మకాలు వంటి అక్రమ కార్యకలాపాలను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.

యువత మద్యం, మాదకద్రవ్యాలకు బానిసలు కాకుండా తమ భవిష్యత్తుపై దృష్టి పెట్టాలని సూచించారు. తల్లిదండ్రుల ఆశయాలను నిజం చేసే దిశగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా మొత్తం 70 వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ అంజయ్య వెల్లడించారు.