ApRainAlert | బంగాళాఖాతంలో అల్ప పీడ‌నం

ApRainAlert | బంగాళాఖాతంలో అల్ప పీడ‌నం

ApRainAlert | ఏపీ, తెలంగాణ‌ల‌లోని ప‌లు ప్రాంతాల్లో వాన‌లు
రాగ‌ల రెండు రోజుల్లో మోస్త‌రు వ‌ర్షాలు
ఇప్ప‌టికే హైద‌రాబాద్​ను తాకిన నైరుతీ
ఈ నెల 18 నాటికి ఏపీ, తెలంగాణ‌లోని అన్ని ప్రాంతాల‌కు విస్త‌ర‌ణ‌
ఇక 18 నుంచి వారం రోజుల పాటు ఏక ధాటిగా వాన‌లు

ApRainAlert | అమ‌రావ‌తి / విశాఖ‌ప‌ట్నం , ఆంధ్ర‌ప్రభ : పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దక్షిణ కోస్తాంధ్ర నుంచి తమిళనాడు వరకు ద్రోణి విస్తరించి ఉందని అమరావతి వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో సోమవారం ఏపీలోని మన్యం, అల్లూరి, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు, నంద్యాల, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని అలర్ట్ ఇచ్చారు.

అలాగే శ్రీకాకుళం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, గుంటూరు, బాపట్ల, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ లైట్ టు మోడరేట్ వానలు కురుస్తాయి. ఇక తెలంగాణ‌లోని ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో ఈ రోజు మధ్యాహ్నం నుంచి రేపు ఉదయం వరకు ఉరుములు, మెరుపులతో వానలు పడొచ్చు.

ఎల్లో అలర్ట్​ జారీ..
అలాగే ఏపీ, తెలంగాణాల‌లో ఈ అల్ప‌పీడ‌నం వ‌ల్ల రాబోయే వారం రోజుల పాటు పిడుగులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. ఈ క్రమంలోనే ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో రుతుపవనాలు జోరందుకుంటున్నాయి. చాలా ప్రాంతాల్లో వానలు దంచికొడుతున్నాయి. రాబోయే ఏడు రోజుల పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని హైదరాబాద్, అమరావతి వాతావరణ కేంద్రాలు వెల్లడించాయి.

హైద‌రాబాద్ ను తాకిన నైరుతి..
తాజాగా తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లోకి ప్రవేశించినట్లు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. రానున్న 4 నుంచి 5 రోజుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని మిగిలిన ప్రాంతాలన్నింటికీ రుతుపవనాలు విస్తరించడానికి పరిస్థితులు సానుకూలంగా ఉన్నాయని పేర్కొంది. ఆదివారం నాటికి రుతుపవనాల ఉత్తర సరిహద్దు (నార్తర్న్ లిమిట్ ఆఫ్ మాన్‌సూన్) మహారాష్ట్రలోని హర్నై, సోలాపూర్ మీదుగా ప్రయాణిస్తూ.. తెలంగాణలోని హైదరాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఆంధ్రప్రదేశ్‌లోని కళింగపట్నం వరకు విస్తరించినట్లు వాతావరణ శాఖ తెలిపింది. అక్కడి నుంచి పారాదీప్, బరిపడ, ధన్‌బాద్ మీదుగా ముజఫర్‌పూర్ వరకు రుతుపవనాల విస్తరణ కొనసాగుతున్నట్లు స్పష్టం చేసింది. దీంతో ముఖ్యంగా ఉత్తర, తూర్పు, మధ్య తెలంగాణ జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికారులు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. రాబోయే రెండు రోజుల పాటు గరిష్ఠ ఉష్ణోగ్రతల్లో పెద్దగా మార్పులు ఉండకపోయినా.. ఆ తర్వాత మూడు రోజుల్లో టెంపరేచర్స్ తగ్గే అవకాశం ఉంది.

18 నుంచి జోరుగా వాన‌లు..
కేరళను టైంకి టచ్ చేసిన నైరుతి రుతుపవనాలు.. తెలంగాణ అంతటా విస్తరించడానికి మరో 4 నుంచి 5 రోజుల టైం పట్టేలా ఉంది. దీనివల్ల వానల అసలు సిసలైన వానల జోరు జూన్ 18 తర్వాతే కనిపించనుందని వాతావరణ శాఖ తెలిపింది. జూన్ 18 నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడతాయని ఐఎండీ స్పష్టం చేసింది. ఈ టైంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉంది. హైదరాబాద్ సిటీలో కూడా ఈ మూడు రోజులు స్కై మొత్తం క్లౌడీగా ఉండి, ఉరుములతో కూడిన భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉంది. ఇక మంగళవారం పెద్దపల్లి, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరితో పాటు పలు జిల్లాల్లో అక్కడక్కడ జల్లులు పడతాయి. ఇక బుధ, గురువారాల్లో నిర్మల్, నిజామాబాద్ సహా దాదాపు అన్ని జిల్లాల్లో వానలు జోరందుకుంటాయి.

click here to read యుద్ధానికి.. శాంతి గీతం

click here to read more