65 lakh people | చదువుతోనే విజ్ఞానం
65 lakh people | చదువుతోనే విజ్ఞానం
- విద్యార్థుల ఎదుగుదలకు తల్లిదండ్రులే తొలి గురువులు
- ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు
65 lakh people | ఒంగోలు రూరల్, ఆంధ్రప్రభ : విద్యతోనే సమాజంలో గుర్తింపు వస్తుందని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్(MLA Damacherla Janardhan) అన్నారు. నగరంలోని పీవీఆర్ బాయ్స్ హై స్కూల్‌లో ఈ రోజు నిర్వహించిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్‌కు ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్రంలో విద్యాభివృద్ధికి కూటమి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని అన్నారు. విద్యాభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రత్యేక చొరవతో రాష్ట్రంలో 65 లక్షల మంది(65 lakh people) విద్యార్థుల తల్లి ఖాతాలో తల్లికి వందనం పథకం ద్వారా 87 వేల కోట్లు నిధులు(87 thousand crores funds) మంజూరు చేసినట్లు తెలిపారు.
జీవితంలో పిల్లలు సక్రమమైన మార్గంలో పయనించడానికి వారి తల్లిదండ్రులే తొలి గురువులనీ పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు,ఉపాధ్యాయులు ,తల్లిదండ్రులు ,విద్యార్థులు పాల్గొన్నారు.
