ఆదేశాలు ఇవ్వడమే కాకుండా..

ఆదేశాలు ఇవ్వడమే కాకుండా..

-డ్రైనేజ్ కాల్వలను శుభ్రం చేయించిన ఒకటో వార్డు కౌన్సిలర్
-ఆలస్యం లేకుండా స్పందించిన తాటికొండ మధు
-స్వయంగా మురికికాలువను పరిశుభ్రత చేసిన కౌన్సిలర్ మధు
-ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన వార్డు ప్రజలు

స్టేషన్ ఘన్ పూర్, ఆంధ్రప్రభ : స్టేషన్ ఘన్ పూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఒకటో వార్డులో నెలకొన్న డ్రైనేజ్ సమస్యకు స్థానిక కౌన్సిలర్ తాటికొండ మధు వెంటనే స్పంధించి శాశ్వత పరిష్కారానికి చర్యలు చేపట్టారు. గత కొంతకాలంగా కాల్వలు మురికితో నిండిపోవడంతో పాటు నీరు నిల్వ ఉండటం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దుర్వాసన వ్యాపించడం, దోమలు పెరగడం వంటి సమస్యలు రోజురోజుకు పెరుగుతుండటంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. చిన్నపిల్లలు, వృద్ధులు ఎక్కువగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నెలకొంది. ఈ సమస్య పై ఒకటో వార్డు కౌన్సిలర్ తాటికొండ మధు స్పందించి ఆలస్యం చేయకుండా సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించారు. కాల్వల్లో పేరుకుపోయిన మురికి, చెత్త కారణంగా నీటి ప్రవాహం పూర్తిగా ఆగిపోయిందని గుర్తించారు.

స్వయంగా పరిశుభ్రత పనుల్లో పాల్గొన్న మధు
సమస్య గుర్తించిన కౌన్సిలర్ మధు కేవలం ఆదేశాలు ఇవ్వడం కాకుండా స్వయంగా పరిశుభ్రత పనుల్లో పాల్గొనడం అందర్ని విశేషంగా ఆకట్టకుంటుంది. కార్మికులతో కలిసి మురుగును తొలగిస్తూ పనులను దగ్గరుండి పర్యవేక్షించారు. ఆయన చొరవతో యంత్రాల సహాయంతో కాల్వల్లో పేరుకు పోయిన మురుగు, చెత్తను పూర్తిగా తొలగించి నీరు సాఫీగా పారేలా చర్యలు తీసుకున్నారు. దీంతో నిల్వ నీరు తొలగిపోవడంతో పాటు పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రత మెరుగుపడింది. సమస్యకు తక్షణ పరి ష్కారం దొరకడంతో స్థానిక ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ప్రజల సమస్యల పట్ల తక్షణమే స్పందించి స్వయంగా పనుల్లో పాల్గొని పరిష్కారం చూపిన కౌన్సిలర్ మధుకు స్థానిక ప్రజలు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి సమస్యలు తలెత్తకుండా క్రమం తప్పకుండా పరిశుభ్రత పనులు చేపట్టాలని వార్డు ప్రజలు కోరారు.