అలా చేస్తే.. కఠిన చర్యలు తప్పవు..
అలా చేస్తే.. కఠిన చర్యలు తప్పవు..
రేగొండ, ఆంధ్రప్రభ : రేగొండ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్ పై కేసు నమోదు చేసినట్లు రేగొండ ఎస్సై. డి. సుధాకర్ తెలిపారు. వివరాల్లోకి వెళితే.. కాల్వపల్లి గ్రామానికి చెందిన ట్రాక్టర్ యజమాని ఇంధరపు సిద్దు ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా ఇసుకను తరలిస్తున్న క్రమంలో పోలీసులు పట్టుకున్నారు.
అనంతరం అతని పై చట్టపరమైన చర్యలు తీసుకొని కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు. అక్రమ ఇసుక రవాణా పై కఠినంగా చర్యలు కొనసాగుతాయని, సరైన అనుమతి పత్రాలు లేకుండా ఇసుక తరలిస్తే.. వాహనాలను స్వాధీనం చేసుకోవడంతో పాటు సంబంధిత వ్యక్తుల పై తప్పనిసరిగా కేసులు నమోదు చేస్తామని ఎస్సై హెచ్చరించారు.
