MLA | పేదల సొంతింటి కలను నెరవేర్చుతాం

  • జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్

MLA | (జగ్గయ్యపేట, ఆంధ్రప్రభ) : నిరుపేదల సొంతింటి కలను కూటమి ప్రభుత్వ నెరవేరుస్తుందని జగ్గయ్యపేట శాసనసభ్యుడు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య పేర్కొన్నారు. జగ్గయ్యపేట నియోజకవర్గంలోని పెనుగంచిప్రోలు మండలం, పెనుగంచిప్రోలు గ్రామంలో పీఎం అవాస్ యోజన 2.0 పథకం కింద పెనుగంచిప్రోలు టౌన్‌కి మంజూరైన 59 గృహాల నియామక పత్రాలను సోమవారం లబ్ధిదారులకు ఎమ్మెల్యే అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి పేదవాడి కళ్లలో ఆనందం కనిపించాలి అనే లక్ష్యంతోనే ఈ కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. పెనుగంచిప్రోలు గ్రామంలో 59 ఇళ్లను మంజూరు చేయించడం పేదల సంక్షేమానికి ప్రభుత్వం చూపుతున్న కట్టుబాటు అని అన్నారు. గృహ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ₹1,50,000, రాష్ట్ర ప్రభుత్వం ₹1,00,000, ఎంజిఎన్ఆర్ఇజిఎ ద్వారా ₹27,000, ఎస్బిఎం–ఐహెచ్ఐహెచ్ఎస్ ద్వారా ₹12,000 నిధులను అందిస్తున్నట్లు తెలిపారు. పేదల కోసం ప్రభుత్వం ఇంత పెద్ద స్థాయిలో అందిస్తున్న ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఇంకా ఎవరికైనా సొంత ఇంటి కల నెరవేర్చుకోవాలనుకుంటే, అవసరమైన పత్రాలతో అర్జీ పెట్టుకొని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న ఈ ప్రయోజనాలను పొందాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో పెనుగంచిప్రోలు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చింతల సీతారామయ్య, పెనుగంచిప్రోలు సొసైటీ చైర్మన్ కర్ల వెంకటనారాయణ, వేగినేటి గోపాలకృష్ణ, గజ్జి కృష్ణమూర్తి, జిల్లేపల్లి సుధీర్ బాబు, కొత్తపల్లి సతీష్, చుంచు రమేష్, నల్లపునేని కొండ, కర్ల నాగేశ్వరరావు, కాకాని శ్రీనివాసరావు, ముండ్లపాటి ప్రసాదరావు మాస్టారు, మహమ్మద్ ఆజాద్, కాకాని బ్రహ్మం, ముండ్లపాడు ప్రభాకర్, మాదినేని వెంకటరావు, కర్ల కోటేశ్వరి, కొల్లిపాక బ్రహ్మం, కల్లూరి శ్రీవాణి, నల్లమోలు రాంప్రసాద్, నూతలపాటి కృష్ణ, ముండ్లపాటి రాము, పెనుగొండ రామారావు, కంభం చిరంజీవి, దొడ్ల కొండ, గజ్జి శివ, గుగులోతు రమేష్ పాల్గొన్నారు.

Leave a Reply