బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులకు ఘన సన్మానం

మేడ్చల్, ఆంధ్రప్రభ : బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా నియమితులైన వెంకట్ రెడ్డి, సురేందర్ రెడ్డి, తిరుమల్ రెడ్డి, ఆర్‌కే శ్రీనివాస్‌లను శుక్రవారం బీజేపీ మేడ్చల్ జిల్లా ఉపాధ్యక్షుడు ఎల్లంపేట జగన్ గౌడ్ మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు.

ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు, కామారెడ్డి ఇన్‌చార్జి విక్రం రెడ్డి, మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు బుద్ధి శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శులు అమరం మోహన్ రెడ్డి, ప్రవీణ్ రావ్, జైపాల్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, మచ్చేందర్ రెడ్డి, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply