టూరిజం డెస్టినేషన్ గా ఏపీ..

టూరిజం డెస్టినేషన్ గా ఏపీ..

సీఎం చంద్రబాబు దర్శినికతతో పూర్వవైభవం..
ఏపీ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీ..
టూరిజం కార్యాలయంలో ఘనంగా సీఎం చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు..

ఎన్టీఆర్ బ్యూరో, ఆంధ్రప్రభ : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముందుచూపు దర్శినికత ఆలోచనలతో ఆంధ్రప్రదేశ్లో టూరిజం సెరవేగంగా అభివృద్ధి చెందుతుందని ఏపీ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీ పేర్కొన్నారు. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 76వ పుట్టినరోజు వేడుకలు విజయవాడలోని టూరిజం ప్రధాన కార్యాలయంలో సోమవారం అత్యంత వైభవంగా నిర్వహించారు.

కార్పొరేషన్ ఉన్నతాధికారులు సిబ్బంది అధికారుల సమక్షంలో చైర్మన్ బాలాజీ చంద్రబాబు నాయుడు పుట్టినరోజు కేకును కట్ చేసి అందరికీ తినిపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోటమే ప్రభుత్వం తీసుకుంటున్న పలు చర్యల కారణంగా ఆంధ్రప్రదేశ్ టూరిజం హబ్ గా, అతి ముఖ్యమైన టూరిస్ట్ డెస్టినేషన్ గా మారుతుంది అన్నారు. ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా సిబ్బంది సైతం కష్టపడి పని చేస్తున్నారని కొనియాడారు.

Leave a Reply