మంచి మనసుకు ప్రతిరూపం నారా భువనేశ్వరి

మంచి మనసుకు ప్రతిరూపం నారా భువనేశ్వరి

రాప్తాడు, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో పేదలు కార్మికులు ఆకలితో ఉండకూడదన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యమని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు.అందుకే ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే ఖర్చుకు వెనుకాడకుండా అన్న క్యాంటీన్లను పునఃప్రారంభించారు. రాప్తాడులో నూతనంగా ప్రారంభించిన అన్న క్యాంటీన్ ను ఆమె పరిశీలించారు. సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదినం సంధర్భంగా కేక్ కట్ చేసి ప్రజలకు స్వీట్లు పంపిణీ చేశారు.

రాష్ట్రంలోని 269 క్యాంటీన్లలో 3పూటల భోజనం అందించే విధంగా నారా భువనేశ్వరమ్మ రూ.76 లక్షలు సహాయం చేశారని తెలియజేశారు. రాప్తాడులో భోజనం అందిస్తున్న తీరు రుచి శుభ్రత వంటి వాటిని చూశారు.అక్కడ భోజనం చేస్తున్న వారికి స్వయంగా భోజనం వడ్డించారు.ఆమె కూడా వారితో కలిసి భోజనం చేశారు. ఇక్కడికి ప్రతి రోజు ఎంతో మంది ఆకలితో వస్తుంటారని వారితో మర్యాదగా వ్యవహరిస్తూ భోజనం అందించాలన్నారు.

రుచి శుభ్రత కచ్చితంగా ఉండాలని సిబ్బందికి సూచించారు. ఈ సంధర్భంగా ఎమ్మెల్యే సునీత మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నా ఇంకా చాలా మంది పేదరికంతో ఉంటారన్నారు.కూలీ పనుల కోసం చదువుల కోసం లేదా ఇతర పనుల నిమిత్తం మండల కేంద్రాలకు వస్తుంటారన్నారు.

వారు కొన్నిసార్లు ఆకలితోనే తిరిగి ఇళ్లకు చేరే పరిస్థితి ఉంటుందన్నారు.ఇలాంటి వారికి తక్కువ ఖర్చుతో భోజనం అందించాలనే ముఖ్యమంత్రి అప్పట్లో అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేశారు. పుట్టిన రోజులు ఇతర శుభకార్యాలకు డబ్బు వృథా చేస్తుంటారని అలా కాకుండా అన్న క్యాంటీన్లకు సాయం అందిస్తే ఎంతో మందికి అన్నం పెట్టిన వారవుతారన్నారు.

అలాగే మండలంలోని 16 గ్రామ పంచాయతీల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కేకులు కట్ చేసి ప్రజలకు స్వీట్లు పంపిణీ చేశారు. అక్కడక్కడ అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల కార్యదర్శి దగ్గుపాటి శ్రీనివాసులు మాజీ కన్వీనర్ నారాయణస్వామి క్లస్టర్ ఇంచార్జి సోమర నారాయణ స్వామి ఎంపీడీవో విజయలక్ష్మి డిప్యూటీ ఎంపీడీవోలు అశోక్ బాబు అచ్యుతానంద బాబు ఎంపీటీసీ జాఫర్ ఖాన్ నంబూరి ప్రతాప్ మాజీ సర్పంచ్ నరేష్ టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.