మూడు సార్లు మరమ్మ తులు
మూడు సార్లు మరమ్మ తులు
స్టేషన్ ఘన్‌పూర్, ఆంధ్రప్రభ : స్టేషన్ ఘన్‌పూర్ మున్సిపాలిటీ పరిధిలోని శివునిపల్లి ప్రధాన రహ దారిపై గెస్ట్ హౌస్ ఎదురుగా ఉన్న చిన్న మోరీ సమస్య మళ్లీ తీవ్రంగా మారి ప్రజలను వేధిస్తోంది. గతంలో దాదాపు మూడు సార్లు మరమ్మ తులు చేపట్టినప్పటికీ, మోరీ మళ్లీ కుంగిపోవడంతో రహదారి పరిస్థితి దారుణంగా మారింది. ఈ మార్గం స్థానికులకు ప్రధాన రాకపోకల దారి కావడంతో ప్రతిరోజూ వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొం టున్నారు.
ముఖ్యంగా బైక్‌లు, ఆటోలు ప్రయాణించే వారికి ఈ ప్రాంతం ప్రమాదకరంగా మారింది. రహదారి కుంగిన భాగం కారణంగా వాహ నాలు సరిగా వెళ్లలేక ప్రమాదాలకు గురవుతున్నాయి. ఇప్పటికే పలు చోట్ల చిన్నపాటి ప్రమాదాలు చోటుచేసుకున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాత్కాలిక మరమ్మతులతో సమస్యను మూసివే యడం కాకుండా, దీర్ఘకాలికంగా నిలిచే శాశ్వత పరిష్కారం తీసుకు రావాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
ప్రమాదాలు మరింత పెరగక ముందే సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు తక్షణమే స్పందించి, మోరీను పునర్నిర్మించి రహదారిని సురక్షితంగా మార్చాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.
