చెన్నై జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం..

చెన్నై జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం..

తిరుపతి, ఆంధ్రప్రభ : జిల్లా పుత్తూరు మండలం మరాఠి గేటు సమీపంలో చెన్నై జాతీయ రహదారిపై ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వెళ్తున్న ద్విచక్ర వాహనం డివైడర్‌ను ఢీకొనడంతో వాహనదారుడు అక్కడికక్కడే మృతి చెందాడు.
సమాచారం ప్రకారం, ఆదివారం రాత్రి సుమారు 11 గంటల సమయంలో నగరి నుంచి పుత్తూరు వైపు వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాదంలో మృతుడికి తలకు తీవ్ర గాయాలు కావడంతో అధిక రక్తస్రావం జరిగి సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు.
మృతుడిని పలమనేరు పట్టణానికి చెందిన బి. సాయినాథ్ (25) గా గుర్తించారు. ఆయన HDFC Bank లో ఉద్యోగిగా పనిచేస్తున్నట్లు సమాచారం.
ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఎస్‌ఐ వెంకటలక్ష్మి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Leave a Reply