incident | సాంబారులో పడి బాలుని మృతి..

incident | సాంబారులో పడి బాలుని మృతి..
- పుట్టిన రోజు నాడే.. నూరేళ్లు నిండిన వైనం..
incident | పెద్దపల్లి జిల్లా ధర్మారం, ఆంధ్రప్రభ : ధర్మారం మండలంలోని మల్లాపూర్ గురుకుల పాఠశాల/కళాశాలలో దారుణ ప్రమాద ఘటన(incident) చోటు చేసుకుంది. పుట్టిన రోజు నాడే.. ఆ బాలుడికి నిండు నూరేళ్లు నిండిన విషాద ఘటన వివరాలిలా ఉన్నాయి..
కోటపల్లి గ్రామానికి చెందిన మొగిలి మధుకర్, శారద దంపతులు గత కొంతకాలంగా గురుకుల పాఠశాలలోని క్వార్టర్లో ఉంటూ.. మధుకర్ తాత్కాలిక పద్ధతిలో వంట మనిషిగా పనిచేస్తున్నాడు. వీరికి ఎనిమిదేళ్ల కూతురు మహి, నాలుగేళ్ల మోక్షిత్ ఉన్నారు. ఆదివారం రాత్రి మధుకర్ కుమారుడు మోక్షిత్ జన్మదిన( birthday) వేడుకలకు సిద్ధమవుతున్న తరుణంలో బాలుడు ఆడుకుంటూ వెళ్లి వంట గదిలో ఉన్న వేడి సాంబార్ పాత్రలో ప్రమాదవశాత్తు పడ్డాడు.
గమనించిన తండ్రి మధుకర్ వెంటనే బాలున్ని చికిత్స నిమిత్తం కరీంనగర్ హాస్పిటల్కు తరలించారు. అనంతరం మెరుగైన వైద్య చికిత్స కోసం వరంగల్ లోని ఎంజీఎం హాస్పిటల్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం మోక్షిత్ మరణించాడు. పుట్టిన రోజునే బాలుడు మృతితో తల్లిదండ్రులు విలపించిన తీరు పలువురిని కలచివేసింది.
బాలుని తండ్రి మధుకర్ ధర్మారం పోలీస్ స్టేషన్(Police Station) లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్టు ఎస్సై ఎం. ప్రవీణ్ కుమార్ తెలిపారు.
