ప్రొఫెసర్ మందలింపుతో మనస్థాపం

ప్రొఫెసర్ మందలింపుతో మనస్థాపం
ఎస్వీ ఇంజనీరింగ్ కాలేజీలో విషాదం
నెల్లూరు జిల్లాలో సంచలనం
(ఆంధ్రప్రభ, నెల్లూరు) : నెల్లూరు (Nellore) జిల్లా కొడవలూరు రాజుపాలెం లోని శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కాలేజీలో డిప్లమా చదువుతున్న ఉదయ్ (Uday) అనే విద్యార్థి మూడవ ఫ్లోర్ లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
ట్యాబ్ విషయంలో ప్రొఫెసర్ అనూష (Professor Anusha) మందలించిందని మనస్థాపం చెంది గత రాత్రి హాస్టల్ కి వెళ్లకుండా శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కాలేజీ లోకి వెళ్లి ఉదయ్ ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం, ఇంకా ఉరి వేసుకున్న విద్యార్థిని కిందకి దించని కాలేజీ యాజమాన్యం ఉదయ్ ది పోరుమామిళ్లకి చెందిన వాసి, ఒక్కడే కుమారుడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
