Asaduddin Owaisi | ప్రత్యేక నమాజ్‌కు అసదుద్దీన్ ఒవైసీ పిలుపు

Asaduddin Owaisi | ప్రత్యేక నమాజ్‌కు అసదుద్దీన్ ఒవైసీ పిలుపు

జూలై 26న ‘సలాత్ అల్-ఇస్తిస్కా’ నిర్వహించాలని అసదుద్దీన్ ఒవైసీ పిలుపు
రాష్ట్రంలో తక్కువ వర్షపాతం నేపథ్యంలో మంచి వర్షాలు కురవాలని ప్రత్యేక ప్రార్థనలు

ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : తెలంగాణలో ఈ సీజన్‌లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైన నేపథ్యంలో వర్షాల కోసం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించాలని ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పిలుపునిచ్చారు. జూలై 26 ఉదయం 8 గంటలకు ‘సలాత్ అల్-ఇస్తిస్కా’ (వర్షాల కోసం చేసే ప్రత్యేక నమాజ్) నిర్వహించాలని ఆయన సూచించారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో మంచి వర్షాలు కురిసి రైతులు, ప్రజలకు ఉపశమనం కలగాలని ఈ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్నట్లు తెలిపారు. తెలంగాణలో సాధారణ వర్షపాతంతో పోలిస్తే ఈసారి లోటు నమోదవడంతో, వర్షాలు కురిసి రాష్ట్రంలో అనుకూల పరిస్థితులు నెలకొనాలని ప్రార్థనలు చేయాలని ఒవైసీ కోరారు.