19 may 1913 1 june 1996 మహోన్నత నేత నీలం సంజీవరెడ్డి మళ్లీ పుట్టాలి..

19 may 1913 1 june 1996 మహోన్నత నేత నీలం సంజీవరెడ్డి మళ్లీ పుట్టాలి..
19 may 1913 1 june 1996 రాజకీయాలకు ఆదర్శప్రాయమైన మహానాయకుడు
రాజకీయ నీతి, నిజాయితీకి ప్రతీక నీలం సంజీవరెడ్డి
స్వాతంత్ర్య సమరయోధుడి నుంచి రాష్ట్రపతి పీఠం వరకు
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో నీలం పాత్ర చిరస్మరణీయం
నేటి రాజకీయాలకు నీలం జీవితం ఒక మార్గదర్శకం
ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి, భారత మాజీ రాష్ట్రపతి, డాక్టర్ నీలం సంజీవరెడ్డి గారు. రాజకీయ నీతిజ్ఞుడు, నిష్కళంక ప్రజానాయకుడు. రాజకీయ సమరాలలో, ఆరితేరిన రాజకీయ దురంధరుడు. వానప్రస్థంలో కూడా, రాష్ట్ర, కేంద్ర రాజకీయ నాయకులకు, దేశ సేవాపరంగా, దేశప్రగతి, సంక్షేమ పరంగా, అలుపెరుగని రీతిలో నిరంతరం హితబోధలు చేస్తూ, సందేశాత్మక విశ్లేషణాలను అందిస్తూ, రాజకీయ వ్యవస్థలోనే మకుటాయ మానంగా నిలిచిన స్ఫూర్తిప్రదాత.

స్వాతంత్ర పోరాటాలలో ప్రముఖ నాయకునిగా, భారత రాజకీయ జీవనంలో, అర్థ శతాబ్దానికి పైగా, అత్యంత ప్రతిష్ఠాకరంగా వెలుగొందిన తెలుగు తేజం. స్వాతంత్ర సమర సమయంలో ఎన్నోసార్లు జైలు జీవితం గడిపి ప్రజా శ్రేయస్సుకై జీవితాన్ని అంకితం చేసిన త్యాగధనుడు.
అతి చిన్న వయస్సులోనే – స్వాతంత్రోద్యమంలో అడుగు పెట్టి విజృభించి త్యాగ నిరతితో ముఖ్యమంత్రి పదవి నుంచి ప్రతిష్టాకరమైన రాష్ట్రపతి పీఠాన్ని అధిష్టించగలగిన మాననీయుడు.

మానవత్వమున్న మనిషి, దేశభక్తి పరాయణుడు – నీతి, నిష్కపటం, చిత్తశుద్ధి వంటి లక్షణాలతో కూడిన వ్యక్తిత్వ సంపద వారిది. ఫలితాలు ఎటువైపుకు దారితీసినా, నిక్కమైన నిజాయితితో, సరైన, సన్మార్గ పదాలను ఏనాడూ వీడలేదు.
అభయమూ, నిర్భయమూ వారిలో నిక్షిప్తమైవున్న ప్రధాన లక్షణాలు. వీరిది వినయ ప్రవృత్తి, ఎవరినైనా మర్యాద పూర్వకంగా ఆప్యాయంగా దగ్గరకు చేర్చుకోగల మృదుస్వభావులు. స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా వ్యవహరించే అరుదైన మనస్వి, ప్రమాణాలతో కూడిన నీతి ప్రవర్తనలకు కట్టుబడి వుండే మానవీయ స్ఫూర్తి ప్రదాత.
తను మంత్రి అయిన ప్రతీసారీ, భార్యా, కుమారుని పేర్లలో వున్న ఆస్థి వివరాలను, క్రమం తప్పకుండా ప్రకటించే, సాంప్రదాయాలను ఆయన పాటించేవారు. అట్టి అసాధరణ ప్రక్రియను పాటించిన వారిలో వీరు ప్రథములు. 1960 సం॥ నుంచి ఈ ఆనవాయితీ అమలు కావటం జరిగింది.
ఉమ్మడి కాంగ్రెస్ రాష్ట్రాలలో 1936 సం||లో శ్రీ సంజీవరెడ్డి మంత్రి పదవిని అలంకరించారు. పెద్ద పెద్ద నాయకుల వద్దనుంచి వచ్చిన రికమండేషన్ లెటర్స్‌ను, ఏ మాత్రం లెక్కచెయ్యకుండా తిరస్కరించేవారు.
రాష్ట్రపతిగా పదవి హుందాతనాన్ని కాపాడి ఆత్మ గౌరవాన్ని పరిరక్షించుకున్నారు.
ప్రపంచశాంతికి, రాజకీయ స్థిరత్వానికి, దేశాభివృద్ధికి ఎంతగానో దోహదపడే అద్భుతస్ఫూర్తి ఆయన సొంతం. భారతదేశ సమగ్రతను, అత్యున్నత స్థాయిలో నిలపగల మహనీయులలో శ్రీ సంజీవరెడ్డి ముఖ్యులు.
ఆయనకు సమకాలీల పరిస్థితుల పట్ల, విషయ విశ్లేషణాల పట్ల ప్రగాఢమైన | అవగాహన వుంది. ప్రపంచశాంతికీ, రాజకీయ స్థిరత్వానికి, దేశాభివృద్ధికీ ఎంతగానో దోహదపడే అద్భుత స్ఫూర్తి ఆయనది. భారతదేశ సమగ్రతను అత్యున్నత స్థాయిలో నిలుపగల మహనీయులలో శ్రీ సంజీవరెడ్డి ముఖ్యులు.
1956 నవంబర్ మొదటి తేదీన ఆంధ్రప్రదేశ్ అవతరించింది. తెలుగు వారి ప్రాంతాలు
| దేశంలో ప్రత్యేక విభాగాలయాలు. ఈ నేపధ్యంలో శ్రీ సంజీవరెడ్డి పోషించిన పాత్ర “నభూతోనభవిష్యతి”.
ఆంధ్రప్రదేశ్ అవతరించిన తరువాత ఎన్నో త్యాగాల అనంతరం ప్రప్రథమ ముఖ్యమంత్రిగా శ్రీ సంజీవరెడ్డి పదవి బాధ్యతలను స్వీకరించారు.
ఆంధ్రా, తెలంగాణ అవిభక్త రాష్ట్రంగా రూపొందించిన ఖ్యాతి పూర్తిగా శ్రీ సంజీవరెడ్డికే దక్కుతుంది.
1940 సం||లో వెల్లూరు జైలులో వుండగా భారత జాతీయ కాంగ్రెస్ చరిత్రను డాక్టర్ పట్టాభి సీతారామయ్య గారు చెపుతుండగా శ్రీ సంజీవరెడ్డి గారు వ్రాయటం జరిగింది. తర్వాత కాలంలో భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షులు అవుతామని ఇద్దరూ ఊహించలేదు.
శ్రీ సంజీవరెడ్డి ఉపముఖ్యమంత్రిగా ఉన్నకాలంలో (1953 సం॥ నుంచి నీటి పారుదల, విద్యుత్ ఉత్పత్తికి చెందిన అనేక పధకాలు ప్రారంభమయ్యాయి. 1960-61 నాటికి దాదాపు 30 భారీ ప్రాజెక్టు పూర్తయ్యాయి.
ప్రపంచంలో అత్యుత్తమ వ్యవసాయ వ్యవస్థ కలిగిన ప్రదేశాలలో ఒకటిగా శ్రీ సంజీవరెడ్డి వలన మన ఆంధ్రప్రదేశ్ ప్రఖ్యాతి వహించింది.
వ్యక్తిగత సంతోషం కానీ, సంపద కానీ పొందాలన్న కోరిక ఏ కోశానలేని నిస్వార్థ | ప్రజానాయకులు శ్రీ సంజీవరెడ్డి.
రాష్ట్రపతిగా రాష్ట్రపతి భవనంలో ఉన్న అతి నిరాడంబరంగా నిష్కమయోగిలా, సంచరించేవారు. | శ్రీరామ భక్తుని గానే భగవానుని అంతరంగంలోనే దర్శించుకుంటూ “అంతర్యామి” పొందుతూ చిన్మయ భరితులయేవారు.
రాష్ట్రపతి భవనాన్ని ఒక బంగారు పంజరంగా భావించేవారు. స్వచ్ఛమైన పైరు గాలిని | ఆస్వాధించే ఆహ్లాదకరమైన వాతావరణాన్ని పొందబోయే రోజుల కోసం ఎదురుచూసేవారు.
1982 సం|| జూలై 24వ తేదీ అనంతరం, రాష్ట్రపతి పదవీకాలం పూర్తయిన తరువాత | కొంతకాలం ఒక యోగిలా అనంతపురలో ప్రశాంత జీవనం గడుపుతున్న సమయంలో, ఎందరో అగ్రనేతలూ, నాయకులూ, నిర్విరామంగా నాగ విహార్‌కు వచ్చి పెద్దాయనను దర్శించుకుని ఎన్నో సలహాలను-ఆదేశాలనూ అందుకుని సంతృప్తిగా వెళ్ళేవారు.
విపరీతంగా ఏవగించుకునే నీలం
దేశం కోసం – సర్వస్వాన్నీ ధారపోసిన నీలం, అంతటి త్యాగధనుడు ప్రస్తుత రాజకీయ పరిస్థితులను తలుచుకుంటూ, తీవ్ర అశాంతికి లోనయేవారు. ప్రాంతీయ దురభిమానమంటే “మంచీ చెడులు అన్నింటా వుంటాయి. మంచి మనుష్యులు, మోసగాళ్ళు అన్నిచోట్ల వుంటారు. ప్రత్యేక ముంద్రలు వేయటం, వేరుచేసి మాట్లాడటంలో, అర్థం వుందా ? జాతీయభావం వుండాలి. అది అన్నిచోట్ల అందరిలోనూ అంతర్లీనంగా వుండాలి. నిత్యం సాగే జీవన శ్రవంతికి చక్కని నిదర్శనం గా భావించాలి.” ఈ భావనలే ఆయనలో, నిక్షిప్తంగా వుండేవి.
ఇంటి పెద్దగా ఆదర్శనీయులైన భర్తగా మమతానురాగాలను పంచి ఇచ్చే తండ్రిగా, తాతగా, ఆధ్యాత్మిక గురువుగా, చైతన్య స్పూర్తిగా ఆయన కుటుంబ నేపథ్యం అందంగా అల్లబడిన అరుదైన పొదరిల్లు.
ఆత్మీయాను బంధాల నేపధ్యంలో, ఆయన నాకు పితృ సమానులు. మా కుటుంబానికి ఆత్మ బంధువు. ఆయనతో సాన్నిహిత్యంలో ఆత్మీయతతో కూడిన సుదీర్ఘ సాహచర్యంలో – జన్మజన్మల | అనుబంధమే సుస్పష్టమవుతూ వుంటుంది.
శ్రీ సంజీవరెడ్డి, నాగరత్నమ్మ దంపతులు ఆదర్శనీయులు. ఆరాధ్యనీయులు. వారి ఏకైక పుత్రుడు డాక్టర్ నీలం సుధీర్ రెడ్డి అనంతపురంలో ప్రముఖ సర్జన్. వీరి ఏకక కుమారుడు డాక్టర్ నీలం రమణారెడ్డి తాతగారికి ప్రాణాధితమైన మనుమడు. హైదరాబాద్‌లో ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్, పియపుత్రిక చి॥ అమర అందరికీ ప్రేమాస్పదురాలే.
1996 జూన్ మొదటి తేదీన మా ఆత్మీయ పరమాత్మ బంధువు. ఆరాధ్యనీయులైన దేశాధినేత. | భౌతికంగా అందరికీ దూరమయ్యారు. అంతే ఆయన – దివ్యస్మృతులను హృదయ సుమార్జనలతో ” మననం చేసుకుంటూనే వున్న…..
డా|| కె.వి. కృష్ణకుమారి – కృష్ణక్క
click here to read Peddapalli Bus Depot | మహిళల ఉచిత రవాణాతో బస్సులకు డిమాండ్
